‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సిద్ శ్రీరామ్ ‘దీంతననా’ పాట విడుదల-dheemthanana song released from urvashivo rakshashivo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dheemthanana Song Released From Urvashivo Rakshashivo

‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సిద్ శ్రీరామ్ ‘దీంతననా’ పాట విడుదల

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 04:56 PM IST

‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సిద్ శ్రీరామ్ ‘దీంతననా’ పాట విడుదలైంది.

‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సిద్ శ్రీరామ్ ‘దీంతననా’ పాట విడుదల
‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సిద్ శ్రీరామ్ ‘దీంతననా’ పాట విడుదల

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన "ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన "దీంతననా"పాట విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో".

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందిన అల్లు శిరీష్ తాజా చిత్రం "ఉర్వశివో రాక్షసివో" .

ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటించింది.

ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో భాగంగా నేడు "ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుండి "దీంతననా" అనే మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు.

"నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా

నీ పాదమే దాటు ప్రతిచోటునా

నీ పెదవులు తాకే నా పేరును వింటా

ఓ స్పర్శ కే పొంగిపోతానట

కాలం కలిపింది ఈ జోడి బాగుందని"

అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ చేసిన ఈ పాటలో శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అలానే సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్ మరో క్లాసి మెలోడీ యాడ్ అయింది అని చెప్పొచ్చు.ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

"ఊర్వశివో రాక్షసివో" చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ జీఏ2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

చిత్ర సాంకేతిక వర్గం: దర్శకుడు: రాకేష్ శశి, సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి, డీవోపీ- తన్వీర్, ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.