తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 52: బిగ్‌బాస్ హౌస్‌లో చేపల చెరువు.. ఏడ్చేసిన గీతూ.. అలిసిపోయిన ఆదిరెడ్డి..!

Bigg Boss Telugu 6 Episode 52: బిగ్‌బాస్ హౌస్‌లో చేపల చెరువు.. ఏడ్చేసిన గీతూ.. అలిసిపోయిన ఆదిరెడ్డి..!

26 October 2022, 6:39 IST

google News
    • Bigg Boss Telugu 6 Episode 52: బిగ్‌బాస్ 8వ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ జంటలుగా విడిపోయి వీలైనన్నీ ఎక్కువ చేపలను దాచుకోవాలి. ఎవరి వద్దనైతే తక్కువ చేపలు ఉంటాయో వారు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఆదేశిస్తాడు. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి-గీతూ ఫిజికల్‌గా గట్టిగా ఆడినప్పటికీ తక్కువ చేపలతో రేసు నుంచి నిష్క్రమిస్తారు.
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్

బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్

Bigg Boss Telugu 6 Episode 52: బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ హీటెడ్ ఆర్గ్యూమెంట్స్‌తో రసవత్తరంగా సాగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఎపిసోడ్‌లో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ చేపల చెరువు అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో గలాట గీతూ హడావిడి నడిచింది. ఫిజికల్ టాస్కుల్లో పోటీ పడలేనని గ్రహించిన గీతూ.. ఇతర హౌస్ మేట్స్‌ను రెచ్చగొట్టడమే ప్రధానంగా మార్చుకుని వారిని కవ్వించింది. మరోపక్క రేవంత్ ఈ రోజు కూల్ లూజ్ అవ్వకుండా చాలా వరకు ప్రయత్నించాడు. చేపలను పట్టుకునేందుకు, వాటిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు.

చేపల చెరువు టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు చేపలను పట్టుకుని జాగ్రత్తపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ ముగిసిన వెంటనే బిగ్‌బాస్ అడిగినప్పుడు అత్యంత తక్కువ చేపలు ఉన్న జోడి పోటీ నుంచి నిష్క్రమిస్తుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే ఛాలెంజ్‌లో పాల్గొని తమ చేపల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ ఛాలెంజ్‌లో పోటీ పడటానికి సైరన్ మోగినప్పుడల్లా హౌస్ మేట్స్ పూల్‌లో దిగి గోల్డ్ కాయిన్ వెతకాల్సి ఉంటుంది. దొరికిన జోడి మరో నాలుగు జంటలతో కలిసి ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. గెలిచిన వారికి బిగ్‌బాస్ అదనపు చేపలు ఇస్తారు.

ఈ టాస్క్‌లో సూర్య-వాసంతి, రేవంత్-ఇనాయ, శ్రీహాన్-శ్రీసత్య, బాలాదిత్య- మెరీనా, ఆదిరెడ్డి-గీతూ, రోహిత్-కీర్తి, రాజ్-ఫైమా జంటలుగా ఆడారు. ఫిజికల్‌గా పోటీ పడలేమని ముందుగానే గ్రహించిన గీతూ హౌస్ మేట్స్‌ను రెచ్చగొట్టాలని ముందే ఆదిరెడ్డితో కలిసి ప్లాన్ చేసింది. ముందుగా రేవంత్ రెచ్చిపోతే అప్పుడు ఇనాయ చేపల్ని పట్టుకోలేదని, అలాగే కీర్తితో కూడా వాదన పెట్టుకుంటానని వ్యూహం పన్నింది. అనుకున్నట్లుగానే హౌస్ మేట్స్ నుంచి చేపలను దొంగిలించేందుకు గీతూ విఫలయత్నం చేసింది. అయితే సూర్య అడ్డుకున్నాడు. కానీ ఆదిరెడ్డిన బ్లాక్ చేసిన హౌస్ మేట్స్.. గీతూ నుంచి కొన్ని చేపలను దొంగిలించారు. రోహిత్, మెరీనా కలిసి ఆడుతున్నారంటూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది గీతూ. నేను కావాలనే టార్గెట్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

గీతూ ప్లాన్‌కు బలైన ఆదిరెడ్డి..

గీతూ ఇలా దొంగ ప్లాన్‌లు అమలు చేస్తుంటే.. అందుకు పావులాగా ఆదిరెడ్డి మారాడు. ఫిజికల్ టాస్క్‌లో తన పూర్తి 100 శాతం ఇచ్చాడు. ఒక్కసారిగా సూర్య, రోహిత్, బాలాదిత్య అందరూ వచ్చి మీదపడటంతో అతడు అక్కడే బ్లాక్ అయ్యాడు. ఫలితంగా మిగిలిన వారు గీతూ నుంచి చేపలను దొంగిలించారు. అయినప్పటికీ ఆది పైకి లేచి వాసంతి, ఫైమా, శ్రీసత్య నుంచి కొన్ని చేపలను దొంగిలించారు. గీతూ-ఆదిరెడ్డి దొంగతనంతో ఫిజికల్‌గా బాగా ఆడినప్పటికీ.. తమ చేపలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ఓ పక్క దొంగిలించిన చేపలను కాపాడుకుందాం గీతూ.. అని ఆదిరెడ్డి బ్రతిమాలాడిన ఆమె వినకుండా ఎదుటివారిని రెచ్చగొట్టి వారి చేపలను దొంగిలించే పనిలోనే ఉంది. ఫలితంగా అందరికంటే తక్కువ చేపల్ని సంపాదించిన జంటగా గీతూ-ఆది జంట నిలిచింది. ఫిజికల్‌గా గట్టి ప్రయత్నం చేసిన గీతూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఏడుపేమో కానీ.. తన గోయి తనే తవ్వుకున్నట్లు గీతూ వ్యూహానికి ఆదిరెడ్డి బలయ్యాడు. ఫలితంగా వీరి జోడీనే అందరి కంటే చివరిలో నిలిచి రేసు నుంచి తప్పుకుంది.

పూల్‌లో ఉన్న గోల్డ్ కాయిన్‌ రేవంత్‌కు దక్కడంతో వారితో పాటు మరో మూడు జంటలు పుష్ ఫర్ ఫిష్ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నాయి. మొదటి రౌండులో నాలుగు జంటల నుంచ ఒక్కో సభ్యులు కార్ట్‌పై కూర్చున్నారు. మిగిలిన నలుగురు పుష్ చేయడం ప్రారంభించారు. మొదటి రౌండులో రాజ్-శ్రీహాన్.. రేవంత్-బాలాదిత్యపై విజయం సాధించారు. సెకండ్ రౌండులో రాజ్-ఫైమా గెలిచి పది చేపలను సాధించుకున్నారు. ఎపిసోడ్ ముగిసే సమయానికి రేవంత్-ఇనాయ వద్ద అత్యధికంగా 58 చేపలు మిగిలి ఉన్నాయి. చివరగా ఆదిరెడ్డి-గీతూ వద్ద అత్యంత తక్కువగా 24 చేపలు ఉండటంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంది. నిష్క్రమణ తర్వాత గీతూ తన చేపలను గాల్లోకి విసిరేయడంతో మిగిలినవారు ఏరుకున్నారు. సత్య, సూర్య మైక్ ధరించి పూల్‌లోకి దిగడంతో 10 చేపల జరిమానా విధించాడు బిగ్‌‍బాస్. మొదటి రోజు పూర్తయ్యే సరికి గీతూ-ఆదిరెడ్డి మినహా మిగిలిన వారు కెప్టెన్సీ పోటీదారుల రేసులో పోటీ పడుతున్నారు.

తదుపరి వ్యాసం