Bigg Boss 6 Telugu Episode 45: బిగ్‌బాస్‌కే బీపీ తెప్పించారు.. హౌస్‌మేట్స్‌పై పెద్దన్న ఫైర్.. గెట్ ఔట్ అంటూ వార్నింగ్..!-bigg boss fires on contestants for negligence in tasks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu Episode 45: బిగ్‌బాస్‌కే బీపీ తెప్పించారు.. హౌస్‌మేట్స్‌పై పెద్దన్న ఫైర్.. గెట్ ఔట్ అంటూ వార్నింగ్..!

Bigg Boss 6 Telugu Episode 45: బిగ్‌బాస్‌కే బీపీ తెప్పించారు.. హౌస్‌మేట్స్‌పై పెద్దన్న ఫైర్.. గెట్ ఔట్ అంటూ వార్నింగ్..!

Maragani Govardhan HT Telugu
Oct 19, 2022 06:51 AM IST

Bigg Boss 6 Telugu Episode 45: బిగ్‌బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్ అనే క్యాప్షన్‌లో ఎంటర్టైన్మెంట్ మినహా మిగిలినవన్నీ చేస్తున్నారు హౌస్ మేట్స్. టాస్క్‌ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై బిగ్‌బాస్ ఆగ్రహించారు. ఇక్కడ ఉండటం ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చు అంటూ గేట్లు ఎత్తేశారు.

బిగ్‌బాస్ 6 ఎపిసోడ్ 45
బిగ్‌బాస్ 6 ఎపిసోడ్ 45

Bigg Boss 6 Telugu Episode 45: బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత చెత్తగా ఈ సీజన్ సాగుతోంది. ఎలాంటి ఎంటర్టైన్మెంట్లు ఇవ్వకుండా అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ రేటింగ్స్‌ను అటకెక్కించారు. సీజన్ ప్రారంభం నుంచి ఇదే తంతు కొనసాగుతుండటంతో బిగ్‌బాస్ కళ్లు తెరిచాడు. ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ను నిరాశ పరచడంతో దెబ్బకు టాస్క్‌నే రద్దు చేశాడు. అంతటితో ఆగకుండా కాలక్షేపం చేయాలనకుంటున్న వారు ఇంటిని విడిచి వెళ్లిపోవాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇంత వరకు ఏ సీజన్‌లోనూ ఇంటి సభ్యులందర్నీ బయటకు వెళ్లమని గేట్లు తెరిచిన దాఖాలాలు లేవు. కానీ ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల నిరాశజనకమైన ప్రదర్శన పెద్దన్నకు కోపం తెప్పించింది.

ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలాదిత్యం, ఆదిరెడ్డి కూర్చొని నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాగా డిఫెండ్ చేసుకున్నావని బాలాదిత్యను ఆదిరెడ్డి ప్రశంసిస్తాడు. మరోపక్క ఆదిరెడ్డి విషయంలో తను తప్పు చేశానా? అని శ్రీసత్యను అర్జున్ అడుగ్గా.. ఎవరు ఎలా పోతే నీకేంటి నీ గురించి నువ్వు నామినేట్ చేసుకోవాలి.. కానీ ఆదిరెడ్డి విషయంలో అర్జున్ నిజంగానే తప్పు చేశాడనే రేంజ్‌లో ఆమె అతడికి క్లాస్ పీకుతుంది. ఇందుకు మనోడు కూడాగట్టిగానే ఫీలవుతాడు. రోజు రోజుకు శ్రీసత్యకు అర్జున్ కంప్లీట్ సరెండర్ అయిపోయాడేమే అనిపిస్తోంది.

ఇంతలో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ఇస్తాడు. హీరోలను ఇమిటేడ్ చేసి వినోదాన్ని పండించాలని ఒక్కొక్కరికి ఒక్కో పాత్రను అప్పగిస్తారు. అయితే ఇక్కడ చాలా మంది బిగ్‌బాస్ ఆదేశాన్ని పక్కన పెట్టి ఏదో నామామాత్రంగా చేసేశారు. టాస్క్‌ పట్ల సీరియస్ లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిగ్‌బాస్ కోపం వచ్చింది. దీంతో హౌస్ మేట్స్ అందరినీ నిలుచోబెట్టి క్లాస్ పీకుతాడు. మీకు బిగ్బాస్ ఆదేశాలు అంటే నిర్లక్ష్యం.. టాస్క్‌ల పట్ల నిర్లక్ష్యం.. మీ నిర్లక్ష్యం బిగ్‌బాస్‌నే కాకుండా ప్రేక్షకుల్నీ కూడా నిరాశపరిచింది. బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఈ టాస్క్‌ను రద్దు చేస్తున్నాం.. ఈ షో పట్ల.. ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోతే బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోండి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు బిగ్‌బాస్.

ఇంత చేసినా హౌస్ మేట్స్‌కు ఇంకా బుద్దిరాలేదనే చెప్పాలి. అందర్నీ కలిపి తిట్టడంతో నన్ను కాదంటే నన్ను కాదంటూ ప్రవర్తించి ఎవరి పర్ఫార్మెన్స్ వారు ఇచ్చారు. శ్రీహాన్ అయితే తానేదో ఓపెన్ అయి టాస్క్‌లు ఇరగదీశాడనుకుంటే.. కెమెరా దగ్గరకు వెళ్లి.. టైమ్‌కు తినాలి.. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి.. అంటూ తన పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ముందు వాళ్లకి బిగ్‌బాస్ షో గురించి చెప్పండి బిగ్‌బాస్.. మినిమమ్ క్లారిటీ లేదు. ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అని అంటాడు. మరోపక్క ఆర్జే సూర్య ఎప్పుడూ ఇనాయాతో సరస సల్లాపాలతో మునిగి తేలడమే తప్పా.. గేమ్‌ను ఎప్పుడో పక్కన పెట్టేశాడు. మనం ఎంత ప్రయత్నం చేసినా.. మిగిలిన వాళ్ల వల్ల అది ఆగిపోతే చాలా పెయిన్ ఉంటది అక్కా అని ఏడ్చేస్తున్నాడు. ఆదిరెడ్డి కూడా తన మీద తనకే ఛీ అనేలా బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెబుతాడు.

మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 6ను కంటెస్టెంట్లు దిగ్విజయంగా వరస్ట్ సీజన్‌గా మార్చేశారు. మేకప్‌లు, రొమాన్స్‌లు, సొల్లు ముచ్చట్లు బిగ్‌బాస్ షోను అడ్డాగా మార్చేశారు. బిగ్‌బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్ అనే క్యాప్షన్‌లో ఎంటర్టైన్మెంట్ మినహా మిగిలినవన్నీ చేస్తున్నారు. అందుకే ఆడియెన్స్ తాలుకూ బాధను, షో తాలుకూ ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని కంటెస్టెంట్ల నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించారు. ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా గేట్లు ఎత్తేసి గెట్ అవుట్ అన్నారు. మరి ఇప్పటికైన హౌస్ మేట్స్ కళ్లు తెరుస్తారో లేదో వేచి చూడాలి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్