Getup Srinu Comments on Bigg Boss: బిగ్‌బాస్ షో‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?-getup srinu shocking comments on bigg boss reality show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Getup Srinu Shocking Comments On Bigg Boss Reality Show

Getup Srinu Comments on Bigg Boss: బిగ్‌బాస్ షో‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

Maragani Govardhan HT Telugu
Oct 18, 2022 11:17 AM IST

Getup Srinu Comments on Bigg Boss: బిగ్‌బాస్ షో గురించి గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను షోలో పాల్గొనకపోవడానికి గల కారణాన్ని వివరించాడు. ప్రస్తుతం తాను సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

గెటప్ శ్రీను
గెటప్ శ్రీను (Facebook)

Getup Srinu Comments on Bigg Boss: బిగ్‌బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది సోషల్ మీడియా ఆర్టిస్టులను ప్రముఖులగా మార్చింది. అంతేకాకుండా పలువురు సెలబ్రెటీలకు నెగిటివిటీని కూడా తీసుకొచ్చింది. అయినప్పటికీ మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపేవారు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది ప్రముఖులు మాత్రం బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. వీరిలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చినా ఎందుకు పాల్గొనలేదు.. అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు శ్రీను. “నేను ప్రస్తుతం జబర్దస్త్ షోతో బిజీగా ఉన్నాను. అలాగే సినిమాల్లోనూ తీరిక లేకుండా నటిస్తున్నాను. ఆ కారణంగానే బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చిన పాల్గొనలేదు. సినిమా ఆఫర్లు లేకపోయినట్లయితే.. అప్పుడు దాని గురించి ఆలోచించేవాడినేమో." అని గెటప్ శ్రీను స్పష్టం చేశాడు.

బిగ్‌బాస్ షోలో పాల్గొనడమంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడమేనని వ్యాఖ్యానించాడు.

“బిగ్‌బాస్ షోలో పాల్గొనడమంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడమే. వ్యక్తిగత విషయాలు ప్రేక్షకులకు తెలియకుంటేనే తెరపై బాగా నటించడం సాధ్యమవుతుంది. అప్పుడే పర్ఫెక్టుగా పర్ఫార్మెన్స్ చేయగలమని" శ్రీను స్పష్టం చేశాడు.

గెటప్ శ్రీను వ్యాఖ్యలపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బిగ్‌బాస్ షోలో భారీ మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసిన అతడు హౌస్‌లో అడుగుపెట్టకపోవడంపై విశేషంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం గెటప్ శ్రీను ఓ పక్క జబర్దస్త్ షోతో పాటు మరోపక్క వరుసగా సినిమా ఆఫర్లు చేజిక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం