తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Budget Increased: ఆదిపురుష్‌పై మరో 100 కోట్లు కుమ్మరించనున్న మేకర్స్‌!

Adipurush Budget Increased: ఆదిపురుష్‌పై మరో 100 కోట్లు కుమ్మరించనున్న మేకర్స్‌!

HT Telugu Desk HT Telugu

08 November 2022, 19:17 IST

    • Adipurush Budget Increased: ఆదిపురుష్‌పై మరో 100 కోట్లు కుమ్మరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్‌ను ఇప్పటికే వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్

Adipurush Budget Increased: ప్రభాస్‌ ఆదిపురుష్‌ మూవీ పాజిటివ్‌ కంటే నెగటివ్‌గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ రిలీజ్‌ అయ్యాయో అప్పటి నుంచే ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఇందులో వాడిన వీఎఫ్ఎక్స్‌, రావణుడి క్యారెక్టర్‌ను చూపించిన తీరుపై నెటిజన్లు పెదవి విరిచారు. వందల కోట్ల బడ్జెట్‌, సుదీర్ఘ కాలం షూటింగ్‌ చేసిన ఈ మూవీ టీజర్‌ మరీ ఇంత చెత్తగా ఉందేంటంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

OTT Releases: ఓటీటీలోకి ఒక్కరోజే 8 సినిమాలు- 3 మాత్రమే స్పెషల్- రెండు బోల్డ్, మరొకటి క్రైమ్ థ్రిల్లర్- ఎక్కడ చూస్తారంటే?

Patang: ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి హీరోయిన్‌గా పతంగ్- కామెడీ స్పోర్ట్స్ డ్రామా- డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్

The 100 Movie: థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డానికి ముందే మొగ‌లి రేకులు సాగ‌ర్ మూవీకి అవార్డ్‌

Barbie Telugu OTT: ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీని తెలుగులో చూడొచ్చు - ఏ ఓటీటీలో అంటే?

ఈ టీజర్‌పై విపరీతమైన ట్రోల్స్‌ రావడంతో మేకర్స్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో కొన్ని వీఎఫ్‌ఎక్స్‌ను మార్చనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఆదిపురుష్‌ బడ్జెట్‌ను రూ.100 కోట్ల మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూవీలో మరీ నాసిరకంగా ఉన్న వీఎఫ్‌ఎక్స్‌ను మెరుగు పరచడంపై దృష్టిసారించాలని నిర్ణయించారు.

టీజర్‌ చూసిన తర్వాత అసలు ఇందులో నటించింది అసలు ప్రభాసేనా లేక కంప్యూటర్‌ జనరేటెడ్‌ వ్యక్తా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు. మరీ కార్టూన్‌ సినిమా చూసినట్లు ఉందనీ కామెంట్లు చేశారు. అయితే వీటిని మొబైల్‌ ఫోన్లలో చూస్తే అలాగే అనిపిస్తుందని, బిగ్‌ స్క్రీన్లపై చూస్తే తెలుస్తుందని మేకర్స్‌ చెప్పుకొచ్చారు. అందుకు తగినట్లే త్రీడీ టీజర్‌ను కాస్త మెరుగ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఇక ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌ను మెరుగుపరచడం కోసం కెనడా, యూకేలకు చెందిన కంపెనీలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఎఫెక్ట్స్‌ను మరింత మెరుగ్గా తీసుకొచ్చి ఆదిపురుష్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసమే మూవీ బడ్జెట్‌ను మరో రూ.100 కోట్ల మేర పెంచినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ మూవీ రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఇండియన్‌ సినిమాలో అత్యధిక బడ్జెట్‌ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే.

నిజానికి ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఆ సమయంలో పెద్ద సినిమాలు చాలానే ఉండటంతో వచ్చే ఏడాది జూన్‌ 16కు రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.