Telugu News  /  Entertainment  /  Prabhas Adipurush Postponed Director Om Raut Announced New Release Date
ప్ర‌భాస్ ఆదిపురుష్
ప్ర‌భాస్ ఆదిపురుష్

Adipurush New Release Date: సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ ఔట్ - కొత్త రిలీజ్ డేట్ ఇదే

07 November 2022, 11:06 ISTNelki Naresh Kumar
07 November 2022, 11:06 IST

Adipurush New Release Date: ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న‌ది. ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తోన్న‌ట్లు సోమ‌వారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Prabhas Adipurush Postponed: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. ఆదిపురుష్ సినిమాను వ‌చ్చే ఏడాది జూన్‌కు పోస్ట్ పోన్ చేస్తున్న‌ట్లుగా సోమ‌వారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓం రౌత్ (Omraut) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసి కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

జూన్ 16న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓం రౌత్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. ఆదిపురుష్ ద్వారా అభిమానుల‌కు అద్భుత‌మైన విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించాడానికి మా టీమ్ కృషిచేస్తోంది. అందుకోసం మాకు మ‌రికొంత స‌మ‌యం కావాల్సివ‌చ్చింది. అందుకే సినిమాను జూన్ 16న రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని ఓంరౌత్ తెలిపాడు. దేశం గ‌ర్వించ‌ద‌గిన సినిమా రూపొందించేందుకు నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్న‌ట్లు పేర్కొన్నాడు ఆదిపురుష్ వాయిదా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టంతో ప్ర‌భాస్ అభిమానులు డిస‌పాయింట్ అవుతున్నారు.

కాగా అక్టోబ‌ర్ 2న అయోధ్య‌లో ఆదిపురుష్ టీజ‌ర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ ఈ టీజ‌ర్‌లో ప్ర‌భాస్, సైఫ్ అలీఖాన్ లుక్‌, విజువ‌ల్స్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. ప‌లువురు ఆధ్యాత్మిక‌, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటూ వ్యాఖ్యానించారు.

విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలోనే ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు వినిపించిన‌ నేప‌థ్యంలో వాటిపై చిత్ర యూనిట్ స్పెష‌ల్‌గా ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ మొత్తం మార్చి కొత్త‌గా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకోస‌మే సినిమాను వాయిదా వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు సంక్రాంతి రేసులో బాల‌కృష్ణ‌, చిరంజీవి సినిమాలు ఉండటం కూడా ఆదిపురుష్ వాయిదాకు కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఈ సినిమాలో జాన‌కిగా కృతిస‌న‌న్ న‌టిస్తోండ‌గా రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. తెలుగు, హిందీతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.