Samantha | ప్రేమకు దూరంగా ఉంటానంటున్న సమంత
30 April 2022, 7:34 IST
ద్వేషంతో పాటు ప్రేమకు దూరంగా ఉండటమే మంచిదంటూ అభిమానులకు సూచిస్తోంది సమంత. ఆమె కథానాయికగా నటించిన కాథు వకుల రెండు కాదల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సమంత అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటిస్తూ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
సమంత
సమంత హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం కాథు వకుల రెండు కాదల్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంతతో పాటు విజయ్ సేతుపతి,నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మిక్స్‌డ్‌టాక్‌ను తెచ్చుకున్నది. అయితే ఈ సినిమాపై వస్తోన్న నెగెటివ్ కామెంట్స్‌పై సమంత డిఫరెంట్‌గా స్పందించింది. ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఆలోచనతోనే తాను ఈ సినిమాలో భాగమైనట్లు చెప్పింది. కథ,పాత్రల విషయంలో లోతుగా విశ్లేషణలు చేయవద్దని,ఎలాంటి ఆలోచనలు లేకుండా రోజువారి టెన్షన్‌ను పక్కనపెట్టి సినిమా ఎంజాయ్ చేయమని అభిమానులను కోరుతోంది.
సినిమా రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో ముచ్చటించింది సమంత. తాను కలిసిన వారిలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అంటూ సమంత పేర్కొన్నది. ఈ సందర్భంగా ఒకేసారి అంతులేని ప్రేమ,ద్వేషాన్ని స్వీకరించాల్సివస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించారు. ప్రేమ,ద్వేషం దేనిని తాను కొనడానికి ప్రయత్నించనని...ఆ రెండింటికి దూరంగా ఉంటానని సమాధానం చెప్పింది. ప్రేమపై కూడా తనకు నమ్మకం లేదని ఈ సమాధానం ద్వారా సమంత చెప్పకనే చెప్పింది అంటూ ఈ ట్వీట్ ఉద్దేశించి నెటిజన్లు చెబుతున్నారు.
ఇటీవలే పుట్టినరోజును జరుపుకున్నది సమంత. ఈ సందర్భంగా తనకు విషెస్ చెప్పిన వారికి బదులు ఇస్తూ అందరి ప్రోత్సాహం, స్ఫూర్తితో ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతానని బదులిచ్చింది. తెలుగులో ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం,యశోద సినిమాలు ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో సమంత బిజీగా ఉంది. డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.