తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Birthday | సామ్‌కు విజయ్ సర్‌ప్రైజ్.. మాములుగా లేదుగా.. వీడియో వైరల్

Samantha Birthday | సామ్‌కు విజయ్ సర్‌ప్రైజ్.. మాములుగా లేదుగా.. వీడియో వైరల్

28 April 2022, 20:09 IST

google News
    • విజయ్ దేవరకొండ.. సమంతకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫేక్ షూటింగ్‌తో ఆమెకు తెలియకుండానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సామ్‌కు విజయ్ సర్‌ప్రైజ్
సామ్‌కు విజయ్ సర్‌ప్రైజ్ (Twitter)

సామ్‌కు విజయ్ సర్‌ప్రైజ్

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే పుష్ప చిత్రంలోని ఐటెం సాంగ్‌తో దేశవ్యాప్తంగా తన క్రేజ్ పెంచేసుకుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మన రౌడీహీరో వినూత్నంగా సామ్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. దీంతో సమంత షాక్‌తో కంగుతిని ఆశ్చర్యపోయింది. ఈ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి వీడియోను పంచుకున్నారు విజయ్.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్, సామ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతుంది. గురువారం సమంత పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. షూటింగ్ సీన్ అంటూ ఓ ఫేక్ డైలాగ్, ఫేక్ రిహార్సల్‌ను జరిపించారు. ఈ విషయం సమంతకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నిజంగానే సినిమా కోసం షూట్ జరుగుతుందని భావించిన సమంత డైలాగులను బాగా ప్రీపేర్ అయింది. అది విజయ్, సామ్ మధ్య నడిచే ప్రేమ సన్నివేశం. సామ్ యాక్టింగ్‌లో లీనమై డైలాగులు చెబుతుంటోంది. అంతలో ఎదురుగా ఉన్న విజయ్ తన డైలాగ్ చెప్పకుండా సమంత హ్యాపీ బర్త్ డే అని చెప్పగానే.. ఆశ్చర్యపోవడం సామ్ వంతైంది.

విజయ్ దేవరకొండ సమంతకు పుట్టినరోజు విషెస్ చెప్పగానే చిత్రయూనిట్ అంతా గట్టిగా అరుస్తూ.. సామ్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆనందంతో పాటు ఆశ్చర్యపోయింది సామ్. అంతేకాకుండా తనకు ఈ సర్‌ప్రైజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, చిత్రయూనిట్‌ను చూసి కొంచెం భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత తొలిసారిగా కలిసి పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో శరవేగంగా జరుగుతోంది.

తదుపరి వ్యాసం