Neha Shetty: పవన్ కళ్యాణ్‌తో డీజే టిల్లు ముద్దుగుమ్మ ఐటెం సాంగ్.. ఓజీ నుంచి క్రేజీ న్యూస్
18 December 2024, 17:03 IST
Neha Shetty: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ మూవీలో నేహాశెట్టి ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
నేహాశెట్టి
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ నుంచి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ నటిస్తోంది. వచ్చే ఈ ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా.. సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
డీజే టిల్లు భామకి ఛాన్స్
ఓజీ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శ్రియా రెడ్డి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలానే జపనీస్ నటుడు కజుకి కిటముర కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోగా.. ఐటెం సాంగ్‌లో డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి డ్యాన్స్ చేయబోతున్నట్లు ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
క్రేజ్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువు
డీజే టిల్లుతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాధిక అలియాస్ నేహాశెట్టి.. ఇటీవల హీరోయిన్‌గా చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. డీజే టిల్లు సీక్వెల్.. డీజే స్క్వేర్‌లో కూడా నేహా శెట్టి కనిపించినా ఆమె పాత్ర అందులో చాలా పరిమితం. దాంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమవుతోందట.
మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా ఓజీ
ఓజీ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా అభిమానులు దీన్ని చూస్తున్నారు. దాంతో ఓటీ టీమ్ అడగ్గానే నేహా శెట్టి ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ.. తెలుగు సినిమాల్లో ఈమధ్య ఐటెం సాంగ్స్‌కి బాగా పాపులారిటీ పెరిగిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీలో శ్రీలీల చేసిన కిస్సిక్ అనే ఐటెం సాంగ్ ఏ తరహాలో యూత్‌ను ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.