తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush - Aishwarya Divorce: విడాకులకు దరఖాస్తు చేసిన హీరో ధనుష్, ఐశ్వర్య: వివరాలివే

Dhanush - Aishwarya Divorce: విడాకులకు దరఖాస్తు చేసిన హీరో ధనుష్, ఐశ్వర్య: వివరాలివే

08 April 2024, 16:15 IST

google News
    • Dhanush - Aishwarya divorce: హీరో ధనుష్, దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ విడాకులకు దరఖాస్తు చేశారు. విడిపోయిన రెండేళ్ల తర్వాత వారు డైవర్స్ కోసం ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. ఆ వివరాలు ఇవే.
Dhanush - Aishwarya divorce: విడాకులకు దరఖాస్తు చేసిన హీరో ధనుష్, ఐశ్వర్య: వివరాలివే
Dhanush - Aishwarya divorce: విడాకులకు దరఖాస్తు చేసిన హీరో ధనుష్, ఐశ్వర్య: వివరాలివే

Dhanush - Aishwarya divorce: విడాకులకు దరఖాస్తు చేసిన హీరో ధనుష్, ఐశ్వర్య: వివరాలివే

Dhanush - Aishwarya divorce: కోలీవుడ్ హీరో ధనుష్, రజినీకాంత్ కూతురు, దర్శకురాలు ఐశ్వర్య విడిపోవడం రెండేళ్ల క్రితం అందరినీ షాక్‍కు గురి చేసింది. పెళ్లి తర్వాత 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న వారు సడెన్‍గా వేరుపడ్డారు. అయితే, విడిపోయిన రెండేళ్ల తర్వాత ధనుష్, ఐశ్వర్య ఇప్పుడు తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు. చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టులో వారు విడాకుల కోసం పిటిషన్ వేశారు.

పరస్పర అంగీకారంతో..

పరస్పర అంగీకారంతో ధనుష్, ఐశ్వర్య సెక్షన్ 13-బీ కింద విడాకులకు కోసం కోర్టులో పిటిషన్ వేశారని సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే వారి కేసు విచారణకు రానుంది. రెండేళ్లుగా ధనుష్, ఐశ్వర్య విడివిడిగా ఉంటున్నారు. అయితే వారి కుమారులు యాత్ర, లింగ స్కూల్ ఈవెంట్లలో మాత్రమే కలిసి కనిపించారు.

తాను, ఐశ్వర్య విడిపోతున్నామని 2022 జనవరి 17వ తేదీన ధనుష్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రిలీజ్ చేశారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు తెలుపుతున్నట్టు వెల్లడించారు.

తాము విడిపోయేందుకు నిర్ణయించుకున్నామని, దీన్ని అందరూ గౌరవించాలని అప్పట్లో లెటర్ రిలీజ్ చేశారు ధనుష్. “దంపతులుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా 18ఏళ్ల పాటు కలిసి ఉన్నాం. పరస్పరం అర్థం చేసుకోవడం, వృద్ధి చెందడం, సర్దుబాట్లతో ఈ ప్రయాణం సాగింది. ఇప్పుడు మా దారులు వేరయ్యే పరిస్థితిలో నిల్చుని ఉన్నాం. దంపతులుగా నేను, ఐశ్వర్య విడిపోయేందుకు నిర్ణయించుకున్నాం. మమ్మల్ని మేం స్వయంగా అర్థం చేసుకునేందుకు సమయం తీసుకోవాలని అనుకుంటున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పరిస్థితుల్లో మాకు అవసరమైన ప్రైవసీ ఇవ్వండి” అని 2022 జనవరిలో ధనుష్ పోస్ట్ చేశారు.

విడిపోయాక కూడా ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోకపోవటంతో మళ్లీ వారు కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు వారు విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

సినిమాల విషయానికి వస్తే..

ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా ఈ ఏడాది విడుదలై మంచి హిట్ అయింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ప్రశంసలను పొందింది. రూ.100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుదం ధనుష్ రెండు చిత్రాలు చేస్తున్నారు. రాయన్ చిత్రంలో హీరోగా నటిస్తుడటంతో పాటు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా కూడా ధనుష్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కుబేర చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా చేస్తున్నారు.

సుమారు ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ డైరెక్షన్‍లో రీఎంట్రీ ఇచ్చి లాల్ సలామ్ చిత్రాన్ని తెరక్కించారు దర్శకురాలు ఐశ్వర్య. ఆమె తండ్రి, సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేశారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన లాల్ సలామ్ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం