తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr Campaign: పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని కేసీఆర్ తాపత్రయం… నల్గొండ నుంచే ప్రచారం ఎందుకు..?

KCR Campaign: పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని కేసీఆర్ తాపత్రయం… నల్గొండ నుంచే ప్రచారం ఎందుకు..?

HT Telugu Desk HT Telugu

24 April 2024, 9:53 IST

google News
    • KCR Campaign: ఏదైనా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఓ సామెత. దీనికి అక్షరాల నమ్ముతున్నట్టు కనిపిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పనిలో పడినట్లు అర్థమవుతోంది.
నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం
నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం

నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం

KCR Campaign: పార్లమెంటు ఎన్నికల Election నేపథ్యంలో ఉమ్మడి Nalgonda నల్గొండ జిల్లా నుంచే కేసీఆర్‌ KCR తన ఎన్నికల ప్రచార యాత్ర మొదలు పెడుతున్నారు. దీనికి మిర్యాలగూడ  Miryalagudaపట్టణం వేదిక కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 24న బుధవారం కేసీఆర్‌ బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. రెండు రోజుల పాటు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నల్గొండ, భువనగిరి Bhuvanagiri  లోక్ సభా నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ ప్రచారంలో Campaign పాల్గొంటారు.

నల్గొండే ఎందుకు ...?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు లోక్ సభా నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. భువనగిరి ఎంపీ సీటు పరిధిలో జనగామ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా అయిదు నల్గొండ జిల్లా పరిధిలోనివి ఉన్నాయి.

2023 డిసెంబరులో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక విధంగా ఈ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. స్వల్ప ఓట్ల మెజారిటీతో ఒక్క సూర్యాపేట అసెంబ్లీ సీటును నిలబెట్టుకున్నా.. మిగిలిన 11 చోట్ల బొక్క బోర్లా పడింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాటి టీఆర్ఎస్ కు వెన్ను దన్నుగా నిలిచిన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నల్గొండ ప్రధానమైంది. ఆ పార్టీ చేతిలో నాడున్న ఎమ్మెల్యే స్థానాల్లో ఆలేరు ఒకటి.

స్వరాష్ట్రం సిద్ధించాక జరిగిన 2014 తొలి ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ 6 చోట్ల గెలిచింది. భువనగిరి ఎంపీ సీటును కూడా గెలుచుకుంది. 2018 ఎన్నికల విషయానికి వచ్చే సరికి బీఆర్ఎస్ ఏకంగా 9 చోట్ల ఎమ్మెల్యేలను గెలుచుకున్నా రెండు ఎంపీ సీట్లలో ఓటమి పాలైంది.

ఇపుడు 9 సీట్ల నుంచి 1 సీటుకు ఆ పార్టీ బలం పడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాలుగా పేరున్న రెండు మూడు జిల్లాల్లో నల్గొండ ఒకటి కావడం, 2023 శాసన సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 11 చోట్ల గెలవడం, రెండు ఎంపీ సీట్లూ కాంగ్రెస్ ఖాతాలోనే ఉండడంతో బీఆర్ఎస్ పట్టు తప్పినట్టయ్యింది.

మొదటినుంచీ పార్టీకి దన్నుగా నిలిచిన నల్గొండపైనే కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఈ కారణంగానే, లోక్ సభ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం అత్యధికంగా ఉన్న మిర్యాలగూడెం నుంచి మొదలు పెడుతున్నారు.

కాంగ్రెస్ కంచు కోటగా... ఉమ్మడి నల్గొండ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ )లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులంతా నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇపుడు ఆ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు మంత్రులు కేబినెట్ లో ఉన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డి ఉన్నారు. 2014 ఎన్నికల్లో గులాబీ గాలి వీచినా.. ఏకంగా అయిదు చోట్ల కాంగ్రెస్, ఒక చోట కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ గెలిచాయి. 2018 ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలకే పరిమితం అయినా.. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి, రెండు చోట్లా కాంగ్రెస్ ఎంపీలు విజయం సాధించారు.

17 ఎంపీ సీట్లున్న తెలంగాణలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 స్థానాలు గెలుచుకుంటే.. రెండు సీట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కావడం ప్రస్తావించాల్సిన అవసరం. ఈ కారణంగానే.. కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం లభిస్తోంది.

ఇక్కడ గెలిస్తే... పట్టుదొరుకుతుందని..

కాంగ్రెస్ పార్టీ మీద పై చేయి సాధించాలంటే.. నల్గొండలోనే దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. నల్గొండ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ సీనియర్ కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీలో ఉన్నారు.

మరో వైపు భువనగిరిలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ రెండు ఎంపీ సీట్లలో గెలిస్తే.. పట్టుచిక్కుతుందన్న అంచనాతో గులాబీ బాస్ ఉన్నట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తున్న తరుణంలో నాగార్జున సాగర్ ఆయకట్టులో సైతం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాక రైతులు బోర్లపై ఆధారపడ్డారు. రైతు బంధు సకాలంలో జమ కాకపోవడం, బావులు, బోర్ల కింద సాగుచేసిసన వరి ధాన్యం కొనుగోలు విషయంలో విఫలం కావడం, రూ.500 బోనస్ ఊసే ఎత్తకపోవడం వంటివన్నీ రైతుల్లో ఆగ్రహాన్ని నింపాయి.

ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ పక్కా స్కెచ్ తోనే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రను మొదలు పెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

తదుపరి వ్యాసం