BRS Mla Prakash Goud : కాంగ్రెస్ కు షాకిచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పార్టీ మార్పునకు బ్రేక్!
BRS Mla Prakash Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆయన... ఇవాళ కార్యకర్తలతో సమావేశం అనంతరం మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరడంలేదని ప్రకటించారు.
BRS Mla Prakahs Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్( Mla Prakash Goud) కాంగ్రెస్ పార్టీకి ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. తన కేడర్ తో సమావేశమైన ప్రకాష్ గౌడ్...ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు సూచించారు. దీంతో తాత్కాలికంగా కాంగ్రెస్(Congress) పార్టీలో చేరే విషయాన్ని విమరించుకున్నట్లు ప్రకాష్ గౌడ్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరే విషయమై తన అనుచరులు, కార్యకర్తల భేటీలో ప్రకాష్ గౌడ్ చర్చించారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ చేరితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ప్రకాష్‌గౌడ్ కు కార్యకర్తలు చెప్పారు. దీంతో ప్రకాష్ గౌడ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అయితే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ప్రకాష్ గౌడ్ చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనుమరాలు ఓ వీడియో విడుదల చేశారు. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ లోనే కొనసాగాలని కోరారు. టీడీపీ రెండు సార్లు, బీఆర్ఎస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు ఆయన బీఆర్ఎస్ లోనే ఉండాలని ఆమె కోరారు.
మనసు మార్చుకున్న ప్రకాష్ గౌడ్
పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతూ ఉన్నారు. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS Mlas Joins Congress)కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గేట్లు తెరిచామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్(Rajendranagar Mla Prakahs Goud)... ఇవాళ తన నివాసంలో ముఖ్య అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మారడంపై వ్యతిరేకత రావడంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కానీ ప్రకాష్ గౌడ్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండు సార్లు కలిశారు. ప్రస్తుతానికి పార్టీ మార్పునకు బ్రేక్ వేసిన ప్రకాష్ గౌడ్... త్వరలో ఏ నిర్ణమైనా తీసుకోవచ్చని ఆయన అనుచరులు అంటున్నారు.
గ్రేటర్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్ లో బీఆర్ఎస్(BRS) ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్... ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ (Khairatabad)ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బాటలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్న పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై బలమైన పట్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతినిత్యం వహించిన మల్కాజిగిరి, సికింద్రబాద్, చేవెళ్ల లోక్ సభ స్థానాలను చాలా సీరియస్ గా తీసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్(Congess) జెండా ఎగరు వేయాలని పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. అందుకోసమే చేరికలపై ఫోకస్ పెట్టారట.
బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మాత్రం రివర్స్ అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది బీఆర్ఎస్ తో టచ్ ఉన్నారని అంటున్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, మళ్లీ బీఆర్ఎస్(BJP) అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేందుకు కుట్ర చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత నాకు ఫోన్ చేసి, 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తానన్నారని, ఇప్పుడే వద్దని వారించానన్నారు.
సంబంధిత కథనం