తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Mp Seat: ఖమ్మం ఎంపీ సీటు.. మండు వేసవిలో మరింత హీట్.! ఇంకా వీడని పీఠముడి

Khammam MP Seat: ఖమ్మం ఎంపీ సీటు.. మండు వేసవిలో మరింత హీట్.! ఇంకా వీడని పీఠముడి

HT Telugu Desk HT Telugu

24 April 2024, 7:20 IST

google News
    • Khammam MP Seat: ఖమ్మం ఎంపీ సీటు పీఠముడి ఇంకా వీడలేదు. ఈ సీటు వ్యవహారం మండు వేసవిలో మరింత హీట్ పుట్టిస్తోంది.
ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంబన
ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంబన

ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంబన

Khammam MP Seat: ఖమ్మం Khammam ఎంపీ సీటు Mp Ticket పీఠముడి ఇంకా వీడలేదు. ఈ సీటు వ్యవహారం మండు వేసవిలో మరింత హీట్ పుట్టిస్తోంది. నామినేషన్ల Nominations దాఖలుకు గడువు ముంచుకొస్తున్న కొద్దీ Khamma Loksabha ఖమ్మం స్థానానికి అభ్యర్థి ఎంపిక మరింత ఝటిలం గా మారుతోంది.

హైదరాబాద్ లో తేలని ఖమ్మం సీటు పంచాయతీ కొద్ది రోజులు ఢిల్లీ కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే Mallikarjuna kharge వద్దకు చేరింది. బెంగుళూరు కేంద్రంగా కర్ణాటక నేత డీకే శివ కుమార్, ఖెర్గేల సమక్షంలో జరిగిన చర్చలు సైతం కొలిక్కి చేరలేదు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు TS Congress Ministers ఈ సీటు తమ వారికి అంటే తమ వారికి అంటూ పట్టు పడుతున్నారు. తొలుత వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ సీటుకి విపరీతమైన పోటీ పెరిగి ఝటిలంగా మారుతున్న క్రమంలో ఆయన ఈ పోటీ నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్యే ప్రధానంగా ఖమ్మం సీటు పంచాయతీ నడుస్తోంది. భట్టి తన సతీమణికి కాకపోతే మరో నేత రాయల నాగేశ్వరరావుకు టిక్కెట్ ఇవ్వాలని పట్టు పడుతుండగా పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కి ఇవ్వాలని భీష్మిస్తున్నారు.

పొంగులేటి వియ్యంకుడి పేరిట నామినేషన్..

పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోసం తొలుత పట్టు పట్టగా ఒకే కుటుంబంలో రెండు పదవుల కోణంలో ఆక్షేపణ రావడంతో అధిష్టాన పెద్దలు అభ్యంతరం వెలిబుచ్చారు.

అయితే ఈ సీటు రేసులో ఉన్న మరో నేత, పొంగులేటి వియ్యంకుడు, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రామసహాయం రఘురామ్ రెడ్డి పేరిట మంగళవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు కావడం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది.

జిల్లా కాంగ్రెస్‌లో పొంగులేటికి చెందిన వర్గీయులే ఈ నామినేషన్ ను దాఖలు చేయడం మరింత వేడిని పుట్టిస్తోంది. శ్రీనివాసరెడ్డి తన సోదరునికి కాకపోతే వియ్యంకునికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో సఫలం అయ్యారా..? లేకపోతే సీటు పంచాయతీ ఎటూ తేలని పక్షంలో తన ఆధిపత్య ధోరణిని చాటుకునేందుకు తన మనుషులతో నామినేషన్ వేయించారా..? అన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

మొత్తమ్మీద కరీంనగర్, హైదరాబాద్ తో పాటు ఖమ్మం సీటు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మరింత కాక రేపుతోంది. గురువారం ఏప్రిల్ 25వ తేదీతో నామినేషన్ల దాఖలుకి ఆఖరు అయినప్పటికీ ఇంకా ఈ సీటు విషయంలో పీఠముడి వీడని పరిస్థితి పార్టీ కార్యకర్తల్లో అసహనం రేపుతోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం