తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ponnam Prabhakar: కేసీఆర్, బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఫైర్… ఎన్నికల డ్రామాలని ఆగ్రహం

Ponnam Prabhakar: కేసీఆర్, బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఫైర్… ఎన్నికల డ్రామాలని ఆగ్రహం

HT Telugu Desk HT Telugu

02 April 2024, 8:21 IST

google News
    • Ponnam Prabhakar: రైతు సమస్యలపై బిజేపి బిఆర్ఎస్ పోరుబాట పట్టడాన్ని రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్, బిజేపి ఎంపీ బండి సంజయ్ వైఖరి పై పొన్నం ఫైర్ అయ్యారు.‌
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కరవు Drpight పరిస్థితులపై కేసీఆర్‌ KCR వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు, ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడిన కరువని పొన్నం స్పష్టం చేశారు.

బిఆర్ఎస్ BRS, బిజెపి BJP చేస్తున్న దుష్ప్రచారాన్ని పొన్నం తిప్పికొట్టారు.  KCR కేసిఆర్ పొలంబాట Polambata, బండి సంజయ్  Bandi Sanjay రైతు దీక్ష రాజకీయ డ్రామాలని పొన్నం విమర్శించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కొహెడలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని, కాంగ్రెస్ వల్లే కరువు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని కేసిఆర్ ఆరోపించడం అర్థరహితమన్నారు. కరువు పరిస్థితులకు, రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల అనంతరం నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చిన కేసిఆర్ సాగు, తాగునీటి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

గత ఏడాది ఆగస్టు మాసంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఎల్ నినో కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటిని సాగు, తాగు అవసరాలకు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.

నిధుల కోసం కేసిఆర్ కలిసి రావాలి

తెలంగాణలో కరువు పరిస్థితులను అధికమించేందుకు కావలసిన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు కేసీఆర్ కలిసి రావాలని పొన్నం డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగు, తాగు నీటికి ఇబ్బంది ఉందని ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైన నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు.

కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్రానికి అధిక నిధులు తేవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడానంటున్న కెసిఆర్, రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కాంగ్రెస్ తో కలిసి బిజెపితో కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాజకీయం చేసే బదులు ఢిల్లీ కి వెళ్ళి కరువు పరిస్థితులు కేంద్రం దృష్టికి తెచ్చి అవసరమైన నిధుల కోసం అడగవలసిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి పై ఉందన్నారు.

రైతు పేరుతో బండి రాజకీయ డ్రామా

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతుల పేరుతో రాజకీయ డ్రామాకు తెర తీసారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కల్లాలలోకి ఇంకా వరి ధాన్యం రాలేదని, అయితే సంజయ్ కల్లాల వద్దే బసచేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో కల్లాలలో ధాన్యం ఉన్నప్పుడు, రైతులు ఇబ్బందులు పడ్డప్పుడు సంజయ్ ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అధిక నిధులు విడుదల చేయించేందుకు కొట్లాడాలని సూచించారు.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి సంజయ్ ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇప్పిస్తే, రాష్ట్రం నుండి అంతే పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. గల్లీలో రైతు దీక్ష పేరుతో రాజకీయం చేయకుండా డిల్లీ లో కొట్లాడి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేక ఏర్పడిన సంక్షోభంపై శ్వేత పత్రం విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రధానలక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి కే.వి.రెడ్డి)

తదుపరి వ్యాసం