Ponnam Prabhakar: అధికారం పోయిన వంద రోజుల్లోనే బిఆర్‌ఎస్‌ కుప్ప కూలుతోందన్న పొన్నం ప్రభాకర్‌-ponnam prabhakar said that the pile of brs is collapsing within 100 days after leaving power ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Ponnam Prabhakar Said That The Pile Of Brs Is Collapsing Within 100 Days After Leaving Power

Ponnam Prabhakar: అధికారం పోయిన వంద రోజుల్లోనే బిఆర్‌ఎస్‌ కుప్ప కూలుతోందన్న పొన్నం ప్రభాకర్‌

HT Telugu Desk HT Telugu
Mar 26, 2024 12:00 PM IST

Ponnam Prabhakar: తెలంగాణలో అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే బీఅర్ఎస్ పార్టీ కుప్పకూలుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే బీఅర్ఎస్ BRS పార్టీ కుప్ప కూలుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం Ponnam ప్రభాకర్ విమర్శించారు. అవినీతి పునాదులపై నిర్మించిన బీఅర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే కుప్పకూలుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ Prabhakar వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

కర్ణాటకలోని మహిమాన్విత పుణ్యక్షేత్రమైన గాణగాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పొన్నం ప్రభాకర్ తిరుగు ప్రయాణంలో జహీరాబాద్ Zahirabad లో పర్యటించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్  Suresh Shetkar తో కలిసి మాట్లాడారు. అవినీతి పునాదులపై బీఅర్ఎస్ పార్టీని నిర్మించారని అధికారం కోల్పోయిన వంద రోజుల్లోనే కుప్పకూలుతోందని విమర్శించారు.

అనైతికంగా, అహంకార పూరితంగా, అబద్ధాలతో నిర్మించింనది ఏది నిలబడదని,కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోతుందని అంటున్న బీఆర్ఎస్ పార్టీని చూస్తే అర్ధం అవుతుందని అన్నారు.

తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు  Congress కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నికులాలు,మతాలను గౌరవిస్తూ పరిపాలనలో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

త్వరలోనే ఆర్టీసీలోకి రెండువేల కొత్త బస్సులు ...

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలుతో నిర్వీర్యమైన ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చామని పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఇప్పటివరకు 33 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని వెల్లడించారు. వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు త్వరలో రెండువేల కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

లోక్ సభ ఎన్నికల ముగిసిన అనంతరం ఆర్టీసీలో 3 వేల ఉద్యోగుల భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. 2013 కు ముందున్న బాండ్లను విడుదల చేశామని,పీఆర్సి ని ప్రకటించామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కృషితో అధికారంలోకి వచ్చిన పార్టీగా వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చమని తెలిపారు.

గతంలో ఎన్నడూ ఆర్టీసీని పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారని అనడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.

తెలంగాణ ప్రజలకు గత పది సంవత్సరాలుగా ఏమిచ్చారని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు భాజపా, భారాస రాజకీయ ఎత్తుగడేనని మంత్రి ఆరోపించారు. స్థానికుడైన మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కు ఎంపీ సీటిచ్చామని, లోక్ సభ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.

జహీరాబాద్ లో మంత్రికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఉన్నారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

WhatsApp channel