తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Assembly Election Results 2023 : రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు!

Assembly Election results 2023 : రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు!

Sharath Chitturi HT Telugu

03 December 2023, 9:49 IST

google News
    • Assembly Election results 2023 : రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ ఫలితాలు..
రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ ఫలితాలు.. (HT_PRINT)

రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ ఫలితాలు..

Assembly Election results 2023 : దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లెక్కింపు​ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యంగా.. ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మధ్యప్రదేశ్​లో ఇలా..

Madhya Pradesh Assembly Election results 2023 : మధ్యప్రదేశ్​లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. మేజిక్​ ఫిగర్​ 116.

ఎర్లీ ట్రెండ్స్​లో బీజేపీ.. 126 సీట్లల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్​ 67 స్థానాల్లో లీడ్​లో ఉంది.

బుద్నీ నుంచి పోటీ చేసిన సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. ముందంజలో ఉన్నారు.

ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో హంగ్​ ఏర్పడటంతో హైఓల్టేజ్​ రాజకీయాలు దర్శనమిచ్చాయి. ఈసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఛత్తీస్​గఢ్​లో ఇలా..

Chhattisgarh Assembly Election results 2023 : ఛత్తీస్​గఢ్​లో 90 సీట్లు ఉన్నాయి. మేజిక్​ ఫిగర్​ 46. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్​ అధికారంలో ఉంది.

ఎర్లీ ట్రెండ్స్​లో కాంగ్రెస్​ 29 సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 42 చోట్ల, కాంగ్రెస్​ 33 స్థానాల్లో లీడ్​లో ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్​ అప్డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రాజస్థాన్​లో ఇలా..

Rajasthan Assembly Election results 2023 : రాజస్థాన్​లో బీజేపీ- కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్​ ప్రకారం.. బీజేపీ 76 చోట్ల, కాంగ్రెస్​ 73 స్థా

రాజస్థాన్​లో మొత్తం 200 సీట్లు ఉండగా.. 199 స్థానాలకు పోలింగ్​ జరిగింది. ఇక్కడ గెలవాలంటే.. మెజారిటీ ఫిగర్​ 100 దాటాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజస్థాన్​ ప్రజలు.. దశాబ్దాలుగా.. ఏ పార్టీకి కూడా వరుసగా రెండోసారి అధికారన్ని కట్టబెట్టలేదు!

వాస్తవానికి మిజోరం ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడాల్సి ఉంది. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమవారానికి వాయిదా వేశారు.

తదుపరి వ్యాసం