తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Saidharm Tej Campaign: సాయిధరమ్‌తేజ్‌ ప్రచారంపై ఆకతాయిల దాడి, గాజు సీసా తగిలి ఒకరికి గాయాలు…

Saidharm Tej Campaign: సాయిధరమ్‌తేజ్‌ ప్రచారంపై ఆకతాయిల దాడి, గాజు సీసా తగిలి ఒకరికి గాయాలు…

Sarath chandra.B HT Telugu

06 May 2024, 9:14 IST

    • Saidharm Tej Campaign: జనసేన, ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆకతాయిలు బాటిల్ విసరడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. 
ఎన్నికల ప్రచారంలో సాయి ధరమ్ తేజ్
ఎన్నికల ప్రచారంలో సాయి ధరమ్ తేజ్

ఎన్నికల ప్రచారంలో సాయి ధరమ్ తేజ్

Saidharm Tej Campaign: జనసేన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆదివారం రాత్రి జనసేన వాహన శ్రేణిపై ప్రత్యర్థులు దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

జనసేన ఎన్నికల ప్రచారం ముగించుకుని సినీ నటుడు సాయి ధరమ్‌తేజ్‌ వాహనాలు ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తు తెలియని రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్‌ గాయపడ్డాడు. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యల్లో భాగంగా కూల్‌ డ్రింక్ సీసాలు, రాళ్లు విసిరారని బాధితుడు ఆరోపించారు.

దాడి ఘటనతో తాటిపర్తిలో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్‌ ప్రచారం నిర్వ హించేందుకు తాటిపర్తికి రావడంతో భారీగా జనసైనికులు స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకున్నారు.

ఈ క్రమంలో యువకులు పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ప్రత్యర్థులు జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి కూడలిలో ప్రచారం ముగించుకుని చినజగ్గంపేట వైపు వెళ్లే క్రమంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది.

టపాకాయలు కాల్చడంతో పాటు నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. సాయిధరమ్‌తేజ్‌ వెళుతుండగా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్‌ తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుణ్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాన్వాయిపై వేసిన రాయి తనకు తగిలినట్లు క్షతగాత్రుడు శ్రీధర్ తెలిపారు. సాయిధరమ్‌తేజ్‌ పర్యటనకు అనూహ్య స్పందన రావడంతోనే ఉక్రోషంతో వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు జనసేన కార్యకర్తలు ఆరోపించారు. జనసేన కార్యకర్తలే తమను రెచ్చగొట్టారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుణ్ని పరామర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్ధి వంగా గీత దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఉదయానికల్లా నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు.

కడప, కర్నూలు నుంచి కొందరు పిఠాపురం వచ్చారని సమాచారం తమకు ముందే ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఈ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం