Mudragada Daughter: పవన్‌తో ముద్రగడ కుమార్తె క్రాంతి భేటీ,పార్టీలో చేరేందుకు రెడీ, తండ్రి కూతుళ్లను విడదీయనన్న జనసేనాని
- Mudragada Daughter: జనసేనలో చేరేందుకు వచ్చిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సర్దిచెప్పారు. అంతా కలిసి ఉండాలని తాను భావిస్తానని తండ్రి కూతుళ్లను విడదీయాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ముద్రగడతో కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామన్నారు.

(2 / 6)
ముద్రగడ కుమార్తెను పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల కోసం తండ్రి బిడ్డలను వేరు చేసి వాడుకున్నట్లు ఉంటుందని, ఎన్ని అభిప్రాయభేదాలు అయినా ఉన్నా అంతా కలిసే ప్రయాణం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.
(3 / 6)
పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి, జనసేనలో ముద్రగడ కుమార్తెను చేర్చుకోడానికి పవన్ నిరాకరించారు. ముద్రగడను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.
(4 / 6)
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం కుమార్తె, క్రాంతి, అల్లుడు చందులు జనసేన పార్టీలో చేరడానికి రావడంతో పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారు.
(5 / 6)
కులాల ఐక్యత కోరుకునే వ్యక్తినని, సమాజంలో మనుషులు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని, తండ్రి బిడ్డలను వేరు చేయనని, ముద్రగడ పెద్దాయన... పది మాటలు అంటారని దానిని భరించాలన్నారు. ముద్రగడ కుమార్తె మెడలో కండువా వేస్తే ఆయన గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందన్నారు.
ఇతర గ్యాలరీలు