తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ias Ips Transfers : ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లపై ఈసీ వేటు, తక్షణమే బదిలీ చేయాలని ఆదేశాలు

AP IAS IPS Transfers : ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లపై ఈసీ వేటు, తక్షణమే బదిలీ చేయాలని ఆదేశాలు

02 April 2024, 17:14 IST

google News
    • AP IAS IPS Transfers : ఏపీ ఉన్నతాధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఐఏఎస్, ఐదుగురు ఐపీఎస్ లు, ఒక ఐజీపై చర్యలు తీసుకుంది. తక్షణమే ఈ అధికారులు బదిలీ చేయాలని ఆదేశించింది.
ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లపై ఈసీ చర్యలు
ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లపై ఈసీ చర్యలు

ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లపై ఈసీ చర్యలు

AP IAS IPS Transfers : ఏపీలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(EC) ఉత్తర్వులు ఇచ్చింది. ముగ్గురు ఐఏఎస్ లు, ఐదుగురు ఐపీఎస్ అధికారులు, ఐజీపై(IAS IPS Transfers) వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని(AP Govt) ఆదేశించింది. ఈసీ ఆదేశాల(EC Orders) మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ముగ్గురు ఐఏఎస్ లు(IAS), ఐదుగురు ఎస్పీలు(SP), ఒక ఐజీపై ఈసీ చర్యలు తీసుకుంది. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎన్నికల అధికారులపై బదిలీ వేటు వేసింది.

బదిలీ అయిన అధికారులు

  • పి.రాజాబాబు, ఐఏఎస్-డీఈవో, కృష్ణా జిల్లా
  • ఎం.గౌతమి, ఐఏఎస్-డీఈవో, అనంతపురం జిల్లా
  • లక్ష్మీశ, ఐఏఎస్-డీఈవో, తిరుపతి
  • పరమేశ్వర్, ఐపీఎస్-ఎస్పీ, ప్రకాశం జిల్లా
  • వై.రవి శంకర్ రెడ్డి,ఐపీఎస్- ఎస్పీ పల్నాడు జిల్లా
  • పి.జాఘువా, ఐపీఎస్-ఎస్పీ, చిత్తూరు జిల్లా
  • కేకేఎన్.అన్బురాజన్, ఐపీఎస్-ఎస్పీ,అనంతపురం జిల్లా
  • కె.తిరుమళేశ్వర్, ఐపీఎస్-ఎస్పీ, నెల్లూరు జిల్లా
  • జి.పాల రాజు, ఐపీఎస్-ఐజీపీ, గుంటూరు రేంజ్

ప్రధాని సభలో భద్రతా వైఫల్యం?

టీడీపీ,బీజేపీ, జనసేన పొత్తు కురిదిన తర్వాత ప్రజాగళం పేరిట చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్నారు. అయితే ఈ సభకు పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సభలో తరచూ అవాంతరాలు ఏర్పడ్డాయని ఈ మూడు పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు పలువురు పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార వైసీపీ మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనలపై విచారించిన ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరికి ఎన్నికల సంబంధిత విధులు కేటాయించవద్దని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని (AP Govt)ఆదేశించింది.

తదుపరి వ్యాసం