తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Chandrababu Pawan Campaign : చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం- ఈ నెల 10, 11న గోదావరి జిల్లాల్లో క్యాంపెయిన్

Chandrababu Pawan Campaign : చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం- ఈ నెల 10, 11న గోదావరి జిల్లాల్లో క్యాంపెయిన్

07 April 2024, 18:47 IST

google News
    • Chandrababu Pawan Campaign : ఏపీలో టీడీపీ, జనసేన ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి. ఇకపై ఉమ్మడి ప్రచారాలకూ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం

Chandrababu Pawan Campaign : ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు యాత్ర(CM Jagan Bus Yatra) చేస్తుంటే, ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ప్రచారాల స్పీడ్ పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభలు నిర్వహిస్తుంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి(Varahi Yatra)విజయ భేరీ యాత్ర చేపట్టారు. ప్రజాగళం ప్రారంభ సభ బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ప్రచారం చేసినా... ఆ తర్వాత మూడు పార్టీలు ఎవరి దారిలో వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు పొసగడంలేదని వైసీపీ తరచూ విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలకు సమాధానంగా టీడీపీ(TDP), జనసేన(Janasena) ఉమ్మడి ప్రచారానికి రంగం సిద్ధం చేశాయి.

చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ (AP Election Notification)కు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజాగళం(Prajagalam) మూడో విడతలో చంద్రబాబు(Chandrababu), పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఉమ్మడిగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే సభల్లో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. 11వ తేదీన పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం ఉంటుంది.

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalay)వారాహి విజయ భేరీ యాత్ర(Vahari Yatra)లో భాగంగా ఇవాళ అనకాపల్లిలో సభ నిర్వహిస్తున్నారు. రేపు ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పవన్ పాల్గొంటారు. 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించే ఉగాది వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు. తీవ్రమైన జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభలకి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈనెల 14న తెనాలిలో పర్యటించనున్నారు. తెనాలి ఇప్పటికే పర్యటించాల్సి ఉండగా… జ్వరం కారణంగా పవన్ పర్యటన వాయిదా పడింది. పవన్ కు జ్వరం తగ్గడంతో…ఇవాళ్టి ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు.

తదుపరి వ్యాసం