తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Amith Shah Tour: నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా.. సోషల్ మీడియా వారియర్స్‌‌, బూత్‌ స‌్థాయి నేతలతో భేటీ

Amith Shah Tour: నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా.. సోషల్ మీడియా వారియర్స్‌‌, బూత్‌ స‌్థాయి నేతలతో భేటీ

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:44 IST

google News
    • Amith Shah Tour: బీజేపీ అగ్రనేత అమిత్‌ షా నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. 3వేల మంది సోషల్ మీడియా వారియర్స్‌తో భేటీ కానున్నారు. 
నేడు హైదరాబాద్‌కు  కేంద్ర హోం మంత్రి అమిత్ షా
నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (HT_PRINT)

నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amith Shah Tour: తెలంగాణలో Telangana నేడు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే లక్ష్యంతో జరిగే సమావేశాల్లో దిశానిర్దేశం చేయనున్నారు.

3వేల మంది సోషల్‌ మీడియా వారియర్స్‌తో Social Media Warriors జరిగే భేటీలో అమిత్‌షా పాల్గొంటారు. పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లతో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనంలో బీజేపీ అగ్రనేత పాల్గొననున్నారు.

అమిత్‌షా పర్యటనలో భాగంగా... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్‌ గార్డెన్‌లో Imperial Garden బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ మీటింగ్‌లో పాల్గొని వారికి అమిత్‌ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయనున్నారు.

మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 వరకు ఎల్‌బీ స్టేడియంలో నిర్వ హించే విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఆ పై మండల స్థాయి నాయకులు, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు పార్టీ కార్యకర్తలకు అమిత్‌ షా మార్గ నిర్దేశం చేస్తారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉండడంతో ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, ఇతరనాయకులు.. మొత్తం దాదాపు 50-60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

బూత్‌ ఏజెంట్లతో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనం ముగిసిన తర్వాత సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, నాయకుల మధ్య మరింత మెరుగైన సమన్వయంపై అమిత్‌ షా స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు.

సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేసిన తర్వాత అమిత్ షా తొలిసారి హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.

తదుపరి వ్యాసం