తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gt Vs Rcb: విల్ జాక్స్ హిట్టింగ్ సునామీ.. మెరుపు సెంచరీ.. దుమ్మురేపిన కోహ్లీ.. గుజరాత్ అడ్డాలో బెంగళూరు అలవోక గెలుపు

GT vs RCB: విల్ జాక్స్ హిట్టింగ్ సునామీ.. మెరుపు సెంచరీ.. దుమ్మురేపిన కోహ్లీ.. గుజరాత్ అడ్డాలో బెంగళూరు అలవోక గెలుపు

28 April 2024, 19:01 IST

    • GT vs RCB IPL 2024: గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. విల్ జాక్స్ మెరుపు సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ అర్ధ శకతంతో మెరిపించాడు. టార్గెట్‍ను 16 ఓవర్లలోనే బెంగళూరు ఛేదించింది.
GT vs RCB: విల్ జాక్స్ హిట్టింగ్ సునామీ.. మెరుపు సెంచరీ.. దుమ్మురేపిన కోహ్లీ.. గుజరాత్ అడ్డాలో బెంగళూరు అలవోక గెలుపు
GT vs RCB: విల్ జాక్స్ హిట్టింగ్ సునామీ.. మెరుపు సెంచరీ.. దుమ్మురేపిన కోహ్లీ.. గుజరాత్ అడ్డాలో బెంగళూరు అలవోక గెలుపు (AP)

GT vs RCB: విల్ జాక్స్ హిట్టింగ్ సునామీ.. మెరుపు సెంచరీ.. దుమ్మురేపిన కోహ్లీ.. గుజరాత్ అడ్డాలో బెంగళూరు అలవోక గెలుపు

GT vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌పై నేడు (ఏప్రిల్ 28) అలవోకగా గెలిచింది. బెంగళూరు బ్యాటర్, ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ మెరుపు అజేయ శతకంతో సునామీ సృష్టించాడు. 41 బంతుల్లోనే 100 పరుగులు చేసి సత్తాచాటాడు. 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 70 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో హోం టీమ్ గుజరాత్‍పై విజయం సాధించింది. ఏకంగా నాలుగు ఓవర్లు మిగిల్చి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‍లో 10 మ్యాచ్‍ల్లో మూడో గెలుపు నమోదు చేసింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు

Deepak Chahar: ఇది రియ‌ల్ లైఫ్ సైంధ‌వ్ మూవీ - హీరోగా నిలిచిన టీమిండియా క్రికెట‌ర్‌ దీప‌క్ చాహ‌ర్‌

జాక్స్ వీరకుమ్ముడు.. కోహ్లీ మెరుపులు

201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛేదించింది. 16 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి.. గెలిచింది బెంగళూరు. విల్ జాక్స్ (100 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులతో (నాటౌట్) చితక్కొట్టాడు. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు కింగ్ కోహ్లీ. ఓ దశలో విరాట్ సెంచరీ చేస్తాడని అనుకుంటే.. సడెన్‍గా జాక్స్ జూలు విదిల్చాడు. వరుస సిక్స్‌లతో గుజరాత్ బౌలర్లను బెెంబేలెత్తించాడు. వీర హిట్టింగ్‍తో అదరగొట్టాడు. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన సమయంలో సిక్స్ కొట్టి.. సరిగ్గా సెంచరీ పూర్తి చేశాడు జాక్స్. జట్టును గెలిపించడంతో పాటు శతకానికి చేరాడు. దీంతో గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకున్నాడు జాక్స్.

అంతకు ముందు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (12 బంతుల్లో 24 నాటౌట్) వేగంగా ఆడాడు. అయితే నాలుగో ఓవర్లో గుజరాత్ స్పిన్నర్ సాయి కిశోర్ అతడిని ఔట్ చేసారు. ఆ తర్వాత విల్ జాక్స్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు. హిట్టింగ్‍తో మోతెక్కించారు. ముఖ్యంగా జాక్స్ ఆశ్చర్యపరిచేలా భారీ సిక్సర్లతో దుమ్మురేపాడు. కోహ్లీ, జాక్స్ అజేయంగా రెండో వికెట్‍కు 74 బంతుల్లో 166 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టును గెలిపించారు. ఐపీఎల్‍లో జాక్స్‌కు ఇదే తొలి సెంచరీ.

మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన జాక్స్.. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. తన చివరి 50 పరుగులను కేవలం 10 బంతుల్లోనే చేసేశాడు. దీంతో లక్ష్యం చాలా వేగంగా కరిగిపోయింది. సెంచరీకి జాక్స్ వేగంగా దూసుకెళ్లాడు. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది బెంగళూరు.

రాణించిన సాయి కిశోర్, షారూఖ్

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 పరుగులు నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వృద్దిమాన్ సాహా (5), కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (16) ఔటయ్యాక.. సుదర్శన్ అదరగొట్టాడు. చివరి వరకు నిలిచాడు. షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా అర్ధ శకతం చేశాడు. సుదర్శన్, షారుఖ్ అదరగొట్టడంతో గుజరాత్‍కు 200 పరుగులు దక్కాయి. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26 పరుగులు; నాటౌట్) చివర్లో పర్వాలేదనిపించాడు.

బెంగళూరు బౌలర్లలో స్పప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీసుకున్నాడు.

గెలిచినా పదో ప్లేస్‍లోనే..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‍లో గెలిచినా పాయింట్ల పట్టికలో చివరిదైన పదో ప్లేస్‍లోనే ఉంది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‍ల్లో మూడు గెలిచి.. ఏడు ఓడింది బెంగళూరు. మిగిలిన నాలుగు లీగ్ మ్యాచ్‍లు గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్‍ల్లో 6 ఓడి, 4 గెలిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

తదుపరి వ్యాసం