తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ఏం పాపం చేశాడు? బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం.. సెంచరీ చేసినా అభిషేక్ లేకపోవడంపై కూడా..

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ఏం పాపం చేశాడు? బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం.. సెంచరీ చేసినా అభిషేక్ లేకపోవడంపై కూడా..

18 July 2024, 22:25 IST

google News
    • Ruturaj Gaikwad: శ్రీలంక పర్యటనకు రుతురాజ్ గైక్వాడ్‍ను బీసీసీఐ తీసుకోలేదు. టీ20 జట్టు నుంచి తప్పించింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అభిషేక్ శర్మను తప్పించడంపై కూడా కొందరు ఫైర్ అవుతున్నారు.
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ఏం పాపం చేశాడు? బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం.. సెంచరీ చేసిన అభిషేక్ లేకపోవడంపై కూడా..
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ఏం పాపం చేశాడు? బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం.. సెంచరీ చేసిన అభిషేక్ లేకపోవడంపై కూడా.. (BCCI-X)

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ ఏం పాపం చేశాడు? బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం.. సెంచరీ చేసిన అభిషేక్ లేకపోవడంపై కూడా..

శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్ కోచ్‍గా తన ప్రస్థానాన్ని మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మొదలుపెట్టనున్నాడు. జూలై 27వ తేదీన టీ20 సిరీస్‍తో ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‍లకు టీమ్‍లను నేడు (జూలై 18) బీసీసీఐ వెల్లడించింది. భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. అయితే, జింబాబ్వేతో గత టీ20 సిరీస్ సహా గతంలోనూ రాణించిన రుతురాజ్ గైక్వాడ్‍ను భారత జట్టు నుంచి తప్పించటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏం పాపం చేశాడు?

శ్రీలంకతో టీ20 సిరీస్‍ కోసం రుతురాజ్ గైక్వాడ్‍ను ఎందుకు భారత జట్టులోకి తీసుకోలేదని బీసీసీఐను కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జింబాబ్వేతో సిరీస్‍లో 158.33 స్ట్రైక్‍రేట్‍తో అద్భుతంగా ఆడిన రుతురాజ్‍ను ఎందుకు తీసుకోలేదని ఫైర్ అవుతున్నారు. నిలకడగా రాణిస్తున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం వెనుక ఆంతర్యమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రుతురాజ్ చేసిన పాపం ఏంటో చెప్పాలని బీసీసీఐను నిలదీస్తున్నారు ఫ్యాన్స్.

125 వర్సెస్ 158

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‍లో కెప్టెన్‍గా వ్యవహరించిన యంగ్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్ ఐదు మ్యాచ్‍ల్లో 125 స్ట్రైక్‍రేట్‍తో 170 పరుగులు చేశాడు. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‍లకు అతడు వైస్ కెప్టెన్‍గా ఎంపికయ్యాడు. ఇక అతడు రెగ్యులర్ వైస్ కెప్టెన్‍గానే ఉండనున్నాడు. అయితే, జింబాబ్వేతో సిరీస్‍లో రుతురాజ్ గైక్వాడ్ నాలుగు మ్యాచ్‍లు ఆడగా.. మూడు మ్యాచ్‍ల్లో బ్యాటింగ్ వచ్చింది. ఆ మూడు ఇన్నింగ్స్‌లోనే 158.3 స్ట్రైక్‍రేట్‍తో 134 రన్స్ చేశాడు. ఇప్పుడు నెటిజన్లు ఇదే గుర్తు చేస్తున్నారు. 158 స్ట్రైక్‍రేట్‍తో పరుగులు చేసిన ఆటగాడిని కాకుండా.. 125 స్ట్రైక్‍రేట్‍తో ఆడిన ప్లేయర్‌కు టీ20ల్లో ఎలా ప్రాధాన్యత ఇస్తారని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. టీ20ల్లో గిల్ కంటే రుతురాజ్ చాలా బెస్ట్ అని అభిప్రాయపడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్‍కు బీసీసీఐ అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్‍పై పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎందుకు గైక్వాడ్‍ను పక్కనపెట్టాడని అడుగుతున్నారు.

ఛాన్స్ దొరికినప్పుడల్లా అదరగొట్టిన గైక్వాడ్

దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‍లో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్‍కు భారత జట్టులో అప్పుడప్పుడు చోటు దక్కుతోంది. అయితే, ఛాన్స్ లభించిన ప్రతీసారి అతడు ఆకట్టుకుంటున్నారు. రుతురాజ్ ఇప్పటి వరకు భారత్ తరఫున 23 టీ20ల్లో 633 పరుగులు చేశాడు. 39.53 యావరేజ్‍తో పాటు 143 స్ట్రైక్‍రేట్ ఉంది. 4 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు. టీమిండియా తరఫున టీ20ల్లో రాణించాడు. అయితే, అతడికి రెగ్యులర్‌గా చోటు దక్కడం లేదు. భారత్ తరఫున ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడిన గైక్వాడ్ 115 రన్స్ చేశాడు.

సెంచరీ చేసినా అభిషేక్‍ ఔట్

జింబాబ్వేతో సిరీస్‍లో రెండో టీ20లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అరంగేట్రం చేసిన తొలి సిరీస్‍లోనే మెరుపు శతకంతో కదం తొక్కాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో సత్తాచాటిన అతడు.. టీమిండియాలో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, సెంచరీ చేసినా అభిషేక్‍ను శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి తప్పించడంపై బీసీసీఐపై కొందరు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.

భారత్, శ్రీలంక మధ్య జూలై 27 నుంచి జూలై 30 వరకు మూడు టీ20ల సిరీస్, ఆగస్టు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 7 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనున్నాయి. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నారు.

తదుపరి వ్యాసం