తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: విరాట్ కోహ్లికి ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. వామప్ మ్యాచ్ ఆడడా.. అసలు ఏమైంది?

Virat Kohli: విరాట్ కోహ్లికి ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. వామప్ మ్యాచ్ ఆడడా.. అసలు ఏమైంది?

Hari Prasad S HT Telugu

02 October 2023, 12:41 IST

google News
    • Virat Kohli: విరాట్ కోహ్లి ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ గువాహటి నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. అతడు వామప్ మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది తెలియ లేదు. ప్రస్తుతం టీమ్ తిరువనంతపురం వెళ్లిపోయింది.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (PTI)

విరాట్ కోహ్లి

Virat Kohli: విరాట్ కోహ్లి ఇండియా ఆడే వామప్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెదర్లాండ్స్ తో ఇండియా తన రెండో వామప్ మ్యాచ్ ను మంగళవారం (అక్టోబర్ 3) తిరువనంతపురంలో ఆడనుంది. దీనికోసం టీమ్ మొత్తం ఇప్పటికే గువాహటి నుంచి తిరువనంతపురం వెళ్లింది. అయితే కోహ్లి మాత్రం టీమ్ తోపాటు అక్కడికి వెళ్లలేదు.

ఇంగ్లండ్ తో గువాహటిలో జరగాల్సిన తొలి వామప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెదర్లాండ్స్ తో రెండో వామప్ మ్యాచ్ కు ఇండియా సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం తిరువనంతపురం వెళ్లాల్సిన విరాట్ కోహ్లి ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ముంబై వెళ్లాడు. అయితే అతడు సోమవారం (అక్టోబర్ 2) సాయంత్రానికి తిరిగి తిరువనంతపురంలోని టీమ్ తో చేరనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

"కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ముంబై వెళ్లాడు. త్వరలోనే మళ్లీ టీమ్ తో చేరతాడు" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఇంగ్లండ్ తో వామప్ మ్యాచ్ ఇండియాకు బాగా ఉపయోగపడుతుందని భావించారు. కానీ వర్షం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నెదర్లాండ్స్ తో మరో మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ జరగాల్సిన తిరువనంతపురంలోనూ వర్షం పడే సూచనలు ఉన్నాయి.

ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ లూ వర్షం బారిన పడ్డాయి. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ పూర్తిగా రద్దవగా.. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ ను 23 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. ఇండియా మ్యాచ్ కు కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో తమ తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా.

ఆ తర్వాత అక్టోబర్ 14న పాకిస్థాన్ తో అహ్మదాబాద్ లో కీలకమైన మ్యాచ్ ఆడుతుంది. ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచిన ఊపులో ఉన్న ఇండియా స్వదేశంలో ట్రోఫీ గెలుస్తుందని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.

తదుపరి వ్యాసం