IND vs NZ 2nd Test: పుణె టెస్టులో నవ్వులు పూయించిన విరాట్ కోహ్లీ ఫన్నీ వాక్, దిక్కులు చూసిన న్యూజిలాండ్ ఆటగాళ్లు
25 October 2024, 6:35 IST
Virat Kohli Funny Walk: అభిమానుల్ని అలరించే విషయంలో విరాట్ కోహ్లీ అందరి కంటే ముందుంటాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. తన సరదా చేష్టలతో మైదానంలో నవ్వులు పూయిస్తుంటాడు.
విరాట్ కోహ్లీ ఫన్నీ వాక్
న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో ఇప్పటికే న్యూజిలాండ్‌ను 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ జట్టు.. నిన్న ఆట ముగిసే సమయానికి 16/1తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం ఆఖరి సెషన్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ రోహిత్ ఔటైపోయినా.. యంగ్ క్రికెటర్లు యశస్వి (6), గిల్ (10) జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి ఆట ముగిసే వరకు మరో వికెట్ పడనివ్వలేదు. తొలి రోజు ఆట ముగిశాక వెంటనే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వచ్చి నవ్వులు పూయించాడు.
నెం.4లో కోహ్లీ రెడీ..
అప్పటికే నెం.4లో బ్యాటింగ్‌కి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ.. గురువారం ఆట ముగిసిన క్షణాల వ్యవధిలోనే అలానే ప్యాడ్లు ధరించి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే మైదానంలోకి వచ్చే సమయంలో విరాట్ కోహ్లీ చాలా అందంగా స్లో వాక్ చేయడం స్టేడియంలో నవ్వులు పూయించింది.
వాస్తవానికి భారత యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ అలా నడుస్తుంటాడు. అతడ్ని ఆటపట్టిస్తూ విరాట్ కోహ్లీ అలా మైదానంలోకి వచ్చినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. న్యూజిలాండ్ ప్లేయర్లు మైదానం నుంచి బయటికి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అలా స్లోగా నడుచుకుంటూ రావడంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక వాళ్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
సెంచరీ సాధించేనా?
ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 70 పరుగులు చేశాడు. కానీ.. అతను టెస్టుల్లో సెంచరీ చేసి చాలా రోజులవుతోంది. దాంతో కనీసం పుణె టెస్టులోనైనా మూడంకెల స్కోరుని కోహ్లీ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే ఇంకా 243 పరుగులు వెనుకబడి ఉంది. గురువారం స్పిన్‌కి సహకరించిన పుణె పిచ్‌పై చెలరేగిన వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. దాంతో ఓవరాల్‌గా న్యూజిలాండ్ 10 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. న్యూజిలాండ్ టీమ్‌లోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దాంతో ఈరోజు భారత్ జట్టు బ్యాటర్లు ఎలా వారిని ఎదుర్కొని పరుగులు చేస్తారో చూడాలి.
టాపిక్