తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Orange Cap Virat Kohli : ఆర్ఆర్‌పై ఆర్సీబీ ఓటమి.. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి ఎఫెక్ట్ కానుందా?

Orange Cap Virat Kohli : ఆర్ఆర్‌పై ఆర్సీబీ ఓటమి.. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి ఎఫెక్ట్ కానుందా?

Sanjiv Kumar HT Telugu

07 April 2024, 8:15 IST

google News
  • Orange Cap IPL 2024 Virat Kohli: శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. మరి ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి ఈ ఓటమితో ఎఫెక్ట్ పడనుందా అనే అంశాలు ఆలోచిస్తే..

ఆర్ఆర్‌పై ఆర్సీబీ ఓటమి.. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి ఎఫెక్ట్ కానుందా?
ఆర్ఆర్‌పై ఆర్సీబీ ఓటమి.. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి ఎఫెక్ట్ కానుందా? (AFP)

ఆర్ఆర్‌పై ఆర్సీబీ ఓటమి.. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీకి ఎఫెక్ట్ కానుందా?

Orange Cap IPL 2024 Update: ఏప్రిల్ 6 (శనివారం) జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును కట్టడి చేయలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. శతకం బాదిన బట్లర్ తన టీమ్ ఆర్ఆర్‌ను గెలుపు వైపుకు పయనించేలా చేశాడు. ఆఖర్లో సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.

విరాట్ కోహ్లీ స్థానం

అయితే, ఆర్సీబీ ఓటమి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న కింగ్ విరాట్ కోహ్లీ స్థానానికి ఎఫెక్ట్ పడనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, అలాంటి ప్రభావం ఏముండదని తెలుస్తోంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని నివారించడంలో విఫలమైనప్పటికీ.. విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. దాంతో ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో తన ఆధిక్యాన్ని పెంచుకున్నాడు కోహ్లీ. కాగా ఈ ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఐదు మ్యాచుల్లో 316 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.

టాప్ 5 రేసులో

ఇక రెండో స్థానంలో 185 పరుగులతో ఆర్ఆర్ ఆటగాడు రియాన్ పరాగ్ ఉన్నాడు. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ 178 పరుగులతో మూడో స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ 177 రన్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 164 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ హైలెట్స్

ఆర్సీబీని ఓడించి అజేయంగా నిలిచిన ఆర్ఆర్ 184 పరుగుల లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ 58 బంతుల్లో 100 రన్స్‌తో అద్భుతమైన ప్రదర్శన చూపాడు. దాంతో ఆర్ఆర్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తొలుత విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 114 పరుగులతో అజేయంగా రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఈ భారత స్టార్ 12 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఆర్ఆర్ బౌలింగ్ విభాగంలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

విరాట్ కోహ్లీ కామెంట్స్

"నేను ఎలాంటి ముందస్తు ప్రణాళికతో రావడం లేదు. నేను దూకుడుగా ఉండకూడదని నాకు తెలుసు. నేను బౌలర్లను అంచనా వేయాల్సి ఉండేది. ఇదంతా కేవలం అనుభవం, పరిస్థితులను ఎదుర్కొనే పరిపక్వత మాత్రమే. ఒకవేళ మంచు కురిసినా పిచ్ ఉపరితలం కఠినంగా, పొడిగా ఉంటుంది. ఇది బ్యాట్స్ మెన్‌కు సులభం కాదు. అశ్విన్ వేసిన బంతిని అంచనావేయలేకపోయాను" అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపాడు.

బట్లర్ రియాక్షన్

"గత మ్యాచుల్లో 13 పరుగులు చేసినప్పటికీ చాలా బాగా ఫీల్ అయ్యాను. నేను దక్షిణాఫ్రికాలో చాలా మంచి ప్రదర్శన ఇచ్చాను. దానికి మించి ఆడాల్సిన ఒక ఇన్నింగ్స్ అవసరం అనిపించింది. మేము సీజన్‌ను చాలా బాగా ప్రారంభించాము. మేము మూడు సీజన్ల నుంచి కలసికట్టుగా ఆడుతున్నాం. మేము ఇప్పటికీ బాగానే ప్రదర్శన చూపుతున్నాం. కానీ, ఇంకా మేము చాలా కష్టపడి ఆడుతూ మరింత వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుంది" అని బట్లర్ చెప్పుకొచ్చాడు.

ఆరెంజ్ క్యాప్ చరిత్ర

ఇదిలా ఉంటే, శుభ్‌మన్ గిల్ గత ఏడాది 17 మ్యాచుల్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. తొలి పర్పుల్ క్యాప్ విజేతగా షాన్ మార్ష్ నిలిచాడు. అతను తొలి సీజన్‌లో 616 పరుగులు చేయగా, మాథ్యూ హెడెన్ 2009లో 572 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. 2010లో సచిన్ టెండూల్కర్ 618 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

తదుపరి వ్యాసం