తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mumbai Indians: తుదిజట్టులో మూడు మార్పులు చేసిన ముంబై ఇండియన్స్.. సూర్య ఈజ్ బ్యాక్.. బోణీ దక్కుతుందా?

Mumbai Indians: తుదిజట్టులో మూడు మార్పులు చేసిన ముంబై ఇండియన్స్.. సూర్య ఈజ్ బ్యాక్.. బోణీ దక్కుతుందా?

07 April 2024, 15:29 IST

    • Mumbai Indians vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్‍తో మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ (MI) భారీ మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ముంబై టీమ్‍లోకి వచ్చేశాడు. తుది జట్ల వివరాలివే..
Mumbai Indians: తుదిజట్టులో మూడు మార్పులు చేసిన ముంబై ఇండియన్స్.. సూర్య ఈజ్ బ్యాక్.. బోణీ దక్కుతుందా?
Mumbai Indians: తుదిజట్టులో మూడు మార్పులు చేసిన ముంబై ఇండియన్స్.. సూర్య ఈజ్ బ్యాక్.. బోణీ దక్కుతుందా?

Mumbai Indians: తుదిజట్టులో మూడు మార్పులు చేసిన ముంబై ఇండియన్స్.. సూర్య ఈజ్ బ్యాక్.. బోణీ దక్కుతుందా?

MI vs DC IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా మూడు ఓటములతో చతికిపడిన ముంబై ఇండియన్స్ జట్టు.. నాలుగో పోరుకు భారీ మార్పులను చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో ముంబై తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. ధనాధన్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకొని తిరిగి రావడం ముంబై జట్టుకు బలంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!

CSK vs RR: చెపాక్‍లో చెన్నై తఢాకా.. రాజస్థాన్‍పై సునాయాస గెలుపు.. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగు

MS Dhoni : సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​!

మూడు మార్పులతో ముంబై

గత మ్యాచ్‍తో పోలిస్తే ఢిల్లీతో నేటి పోరుకు తుది జట్టులో మూడు మార్పులను చేసింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‍లో తొలిసారి ఆడనున్నాడు. నమన్‍ధీర్ స్థానంలో అతడు టీమ్‍లోకి వచ్చాడు. పేసర్ ఎంఫాక స్థానంలో రొమారియో షెఫర్డ్, బ్రెవిస్ స్థానంలో మహమ్మద్ నబీని జట్టులో తీసుకుంది ముంబై.

బోణీ దక్కేనా..

ఐపీఎల్ 2024 సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ మేనేజ్‍మెంట్ అప్పగించింది. అయితే, ఈ సీజన్‍లో తొలి మూడు మ్యాచ్‍ల్లో ముంబై ఓటమి పాలైంది. అసలే రోహిత్‍ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అసంతృప్తితో ఉన్న ఫ్యాన్స్.. వరుస ఓటములతో మరింత గుర్రుగా ఉన్నారు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో నేటి మ్యాచ్‍కు సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి రావటంతో ముంబై బ్యాటింగ్ మరింత బలంగా మారింది. అలాగే, మరో రెండు మార్పులను కూడా చేసింది. ఈ మ్యాచ్‍తోనైనా ఈ సీజన్‍లో ముంబై బోణీ కొడుతుందేమో చూడాలి.

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతోంది. నాలుగు మ్యాచ్‍ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది రిషబ్ పంత్ టీమ్. గత మ్యాచ్‍లో కోల్‍కతా చేతిలో106 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. దీంతో మళ్లీ గెలుపు బాట పట్టాలని పంత్ సేన కసిగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ, 10వ స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్‍లో సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ తుదిజట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెఫర్డ్, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోట్జీ, జస్‍ప్రీత్ బుమ్రా

ముంబై సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: ఆకాశ్ మద్వాల్, క్వెనా ఎంఫకా, నమన్ ధీర్, నేహార్ వదేరా, షామ్స్ ములానీ

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వి షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జై రిచర్డ్ సన్, ఎన్రిచ్ నోర్జే, ఇషాంత్ షర్మ, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: కుమార్ కుషాగ్రా, యశ్ ధుల్, ఫ్రాజెర్ మక్‍గుర్క్, సుమీత్ కుమార్, ప్రవీణ్ దూబే

తదుపరి వ్యాసం