తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Ipl 2025 Players List: టాప్ బౌలర్లతో నిండిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పవర్ హిట్టర్లకీ టీమ్‌లో కొదవలేదు

SRH IPL 2025 Players list: టాప్ బౌలర్లతో నిండిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పవర్ హిట్టర్లకీ టీమ్‌లో కొదవలేదు

Galeti Rajendra HT Telugu

26 November 2024, 7:30 IST

google News
  • Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025 వేలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ చాలా కొత్తగా కనిపిస్తోంది. ఐదుగురిని మినహా.. కొత్త వాళ్లతోనే జట్టుని ఫ్రాంఛైజీ నింపేసింది. ఇందులో ఇషాన్ కిషన్, షమీ లాంటి వాళ్లు ఉన్నారు. 

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు

SRH IPL 2025 Full Squad: ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టుని సమతూకంగా మార్చుకుంది. రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆది, సోమవారం జరిగిన వేలంలో రూ రూ.44.80 కోట్లు ఖర్చు చేసి 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ఆడిన చాలా మంది ప్లేయర్లను వదిలేయగా.. కొత్తగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ లాంటి స్టార్లను టీమ్‌లోకి సన్‌రైర్స్ హైదరాబాద్ తీసుకుంది.

ముంబయి ఇండియన్స్‌కి సుదీర్ఘకాలం ఆడిన ఇషాన్ కిషన్ కోసం రూ.రూ.11.25 కోట్లు ఖర్చు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోసం రూ.10 కోట్లు కుమ్మరించింది. అలానే పేసర్ హర్షల్ పటేల్ రూ.8 కోట్లు, స్పిన్నర్ రాహుల్ చాహర్ రూ.3.2 కోట్లు, ఆల్ రౌండర్ అభినవ్ మనోహర్ రూ.3.2 కోట్లతో జట్టులోకి వచ్చారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఏడుగురు విదేశీయులు సహా 20 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఒక జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు.

ఐపీఎల్ 2025 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

  • హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
  • కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
  • అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
  • నితీష్ రెడ్డి (రూ.6 కోట్లు)
  • ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లు

  • ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు)
  • మహ్మద్ షమీ (రూ.10 కోట్లు)
  • హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు
  • రాహుల్ చాహర్ (రూ.3.2 కోట్లు)
  • అభినవ్ మనోహర్ (రూ.3.2 కోట్లు)
  • ఆడమ్ జంపా - (రూ.2.4 కోట్లు)
  • సిమర్ జీత్ సింగ్ (రూ.1.5 కోట్లు)
  • జయదేవ్ ఉనద్కత్ (రూ.1 కోటి)
  • జీషన్ అన్సారీ (రూ.40 లక్షలు)
  • అథర్వ తైడే (రూ.30 లక్షలు)
  • ఇషాన్ మలింగ (రూ.1.2 కోట్లు)
  • సచిన్ బేబీ (రూ.30 లక్షలు)

ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే

కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ టైడే, అభినవ్ మనోహర్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఇషాన్ మలింగ, సచిన్ బేబీ, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్.

తదుపరి వ్యాసం