తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sri Lanka Vs Bangladesh : ఒక్క సెంచరీ లేకుండానే 500 రన్స్​! 48ఏళ్ల టీమిండియా రికార్డ్​ బ్రేక్​..

Sri Lanka vs Bangladesh : ఒక్క సెంచరీ లేకుండానే 500 రన్స్​! 48ఏళ్ల టీమిండియా రికార్డ్​ బ్రేక్​..

Sharath Chitturi HT Telugu

01 April 2024, 11:07 IST

    • Sri Lanka vs Bangladesh live : బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​లో శ్రీలంక జట్టు.. 48ఏళ్ల రికార్డ్​ని బ్రేక్​ చేసింది. టీమిండియా పేరు మీద ఉన్న ఆ రికార్డ బద్దలైంది.
శ్రీలంక బ్యాటర్స్​..
శ్రీలంక బ్యాటర్స్​.. (AFP)

శ్రీలంక బ్యాటర్స్​..

Sri Lanka vs Bangladesh test series : ఒక టెస్ట్​ మ్యాచ్​లో స్కోర్​ 500 దాటిందంటే.. 'ఎంత మంది సెంచరీలు చేసుంటారో!' అని అనుకుంటాము. 'ఎవరైనా డబుల్​ సెంచరీ చేశారా?' అని స్కోర్​బోర్డ్​ చూస్తాము. కానీ.. అసలు ఒక్క బ్యాటర్​ కూడా సెంచరీ చేయకపోయినా.. స్కోర్​ 500 దాటిందని తెలిస్తే కాస్త ఆశ్చర్యపోతాము కదా! శ్రీలంక వర్సెస్​ బంగ్లాదేశ్​ రెండో టెస్ట్​లో ఇదే జరిగింది. శ్రీలంక బ్యాటర్లలో ఒక్కరు కూడా సెంచరీ దాటకపోయినా.. జట్టు స్కోర్​ మాత్రం 531కి చేరింది. ఫలితంగా.. 48ఏళ్ల రికార్డ్​ను బ్రేక్​ చేసింది శ్రీలంక జట్టు.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

RCB vs DC: వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన బెంగళూరు.. నిలిచిన ప్లేఆఫ్స్ ఆశలు.. అక్షర్ పోరాడినా ఢిల్లీకి భారీ ఓటమి దెబ్బ

శ్రీలంక వర్సెస్​ బంగ్లాదేశ్​ టెస్ట్​..

చిట్టగావ్​ వేదికగా.. మార్చ్​ 30న శ్రీలంక- బంగ్లాదేశ్​ రెండో టెస్ట్​ మ్యాచ్​ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్​కి దిగిన శ్రీలంక జట్టు.. 159 ఓవర్లు ఆడి 531 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యింది. కానీ ఆ జట్టులో ఒక్కరు కూడా సెంచరీ చేయలేదు. ఆరుగురు బ్యాటర్లు హాఫ్​ సెంచరీ చేశారు అంతే! కుషాల్​ మెండిస్​.. జట్టులో అత్యధిక పరుగులు(93) చేశాడు. కమిందు మెండిస్​ 92 రన్స్​ కొట్టాడు.

Sri Lanka vs Bangladesh 2nd test live streaming : 48ఏళ్ల క్రితం ఇండియా సృష్టించిన రికార్డ్​ని శ్రీలంక జట్టు తాజాగా బ్రేక్​ చేసింది. 1976లో కాన్పూర్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్లు కోల్పోయి.. 524 పరుగులు చేసింది టీమిండియా. అప్పుడూ ఒక్కరు కూడా సెంచరీ చేయకుండానే జట్టు స్కోర్​ 500 దాటింది.

ఇక రెండో టెస్ట్​ మొదటి ఇన్నింగ్స్​లో శ్రీలంక ఆలౌట్​ అయిన తర్వాత.. బ్యాటింగ్​కి వచ్చిన బంగ్లాదేశ్​ జట్టు.. రెండో రోజు ముగిసే సమయానికి ఒక వికెట్​ కోల్పోయి 55 పరుగులు చేసింది.

శ్రీలంక బ్యాటర్లు స్కోర్లు ఇలా..

Sri Lanka vs Bangladesh test live : నిషాన్​ మదుష్క- 57, కరుణరత్న- 86, కుషాల్​ మెండిస్​- 93, మాథ్యూస్​- 23, చండిమాల్​- 49, ధనుంజయ డి సెల్వ- 70, కమిందు మెండిస్​- 92 (నాటౌట్​), ప్రభాత్​ జయసూర్య- 28, విశ్వ ఫెర్నాండో- 11, లహిరు కుమార- 6, అశిత ఫెర్నాండో- 0

కమిందు మెండిస్​కి సెంచరీ చేసే అవకాశం దక్కింది. కానీ చివరి బ్యాట్స్​మన్​ అశిత.. డకౌట్​ అవ్వడంతో సెంచరీ కొట్టలేకపోయాడు. 92 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

ఎక్స్​ట్రాలు కూడా తక్కువగానే (6) ఉండయం విశేషం!

Sri Lanka vs Bangladesh test series : ఇక బంగ్లాదేశ్​ బౌలర్లలో.. షకీబ్​ ఉల్​ హాసన్​ మూడు వికెట్లు పడగొట్టాడు. హనస్​ మహ్ము్​ 2 వికెట్లు తీశాడు. ఖలీద్​ అహ్మద్​, మెహది హసన్​లు చరో వికెట్​ పడగొట్టారు.

ఇక రెండు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​లో శ్రీలంక ఇప్పటికే ఒకటి గెలిచింది. రెండో మ్యాచ్​ కూడా గెలిస్తే.. బంగ్లాదేశ్​తో టెస్ట్​ సిరీస్​ని దక్కించుకుంటుంది.

శ్రీలంకతో ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ని బంగ్లాదేశ్​ 2-1 తేడాతో కైవశం చేసుకుంది.

తదుపరి వ్యాసం