South Africa World Cup Team: వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా టీమ్ ఇదే.. టోర్నీ తర్వాత డికాక్ రిటైర్మెంట్
05 September 2023, 16:07 IST
- South Africa World Cup Team: వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా టీమ్ ను కూడా మంగళవారం (సెప్టెంబర్ 5) ఎంపిక చేశారు. ఈ టోర్నీ తర్వాత ఆ టీమ్ స్టార్ ప్లేయర క్వింటన్ డికాక్ రిటైర్ అవనున్నాడు.
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్
South Africa World Cup Team: వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా టీమ్ ను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టును మంగళవారం (సెప్టెంబర్ 5) అనౌన్స్ చేశారు. ఒకేసారి జట్టులో 8 మంది కొత్త వాళ్లకు వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించడం విశేషం. వీళ్లందరికీ ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది.
1992లో తొలిసారి వరల్డ్ కప్ లోకి ఎంటరైనా ప్రొటియాస్ అప్పటి నుంచీ ఈ మెగా టోర్నీ గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతిసారీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నా.. ఇప్పటి వరకూ కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.
ఈసారి కూడా భారీ ఆశలతో సౌతాఫ్రికా టీమ్ ఇండియాకు రానుంది. ఇక ఈ వరల్డ్ కప్ తర్వాత సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రిటైర్ అవనున్నాడు. అతడు కేవలం వన్డేలకు మాత్రం గుడ్ బై చెప్పనున్నాడు. ఈసారి వరల్డ్ కప్ జట్టులోని మొత్తం 15 మందిలో 8 మంది తొలిసారి ఈ మెగా టోర్నీ ఆడబోతున్నారు. ఈ జట్టుకు టెంబా బవుమా కెప్టెన్ గా ఉన్నాడు.
అయితే పేస్ బౌలింగ్ మాత్రం బలంగా ఉంది. అనుభవజ్ఞుడైన కగిసో రబాడాతోపాటు ఎన్రిచ్ నోక్యా, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయెట్జీలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్లుగా కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసి, ఏడెన్ మార్‌క్రమ్ ఉన్నారు. సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. డేవిడ్ మిల్లర్, మార్‌క్రమ్, క్లాసెన్, రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్ లతో ఆ టీమ్ పటిష్టంగా ఉంది.
ఇక ఈ వరల్డ్ కప్ తర్వాత తాను వన్డేల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించి క్వింటన్ డికాక్ ఆశ్చర్యపరిచాడు. అతడు ప్రొటియాస్ తరఫున 140 వన్డేల్లో 6 వేలకుపైగా రన్స్ చేశాడు. సగటు 44.85గా ఉంది. సౌతాఫ్రికా క్రికెట్ లో అటాకింగ్ బ్యాటర్ గా, కెప్టెన్ గా డికాక్ మంచి పేరు సంపాదించాడు.
వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా టీమ్
టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, సిసండా మగాలా, కేశవ్ మహరాజ్, ఏడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఎన్నిచ్ నోక్యా, కగిసో రబాడా, తబ్రేజ్ షంసి, రాసీ వాండెర్ డసెన్