Ntini on Kohli: కోహ్లిని కెలికారో ఇక అంతే.. సౌతాఫ్రికా బౌలర్లకు మాజీ పేసర్ వార్నింగ్-cricket news ntini warns south africa bowlers about kohli ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ntini On Kohli: కోహ్లిని కెలికారో ఇక అంతే.. సౌతాఫ్రికా బౌలర్లకు మాజీ పేసర్ వార్నింగ్

Ntini on Kohli: కోహ్లిని కెలికారో ఇక అంతే.. సౌతాఫ్రికా బౌలర్లకు మాజీ పేసర్ వార్నింగ్

Hari Prasad S HT Telugu
Aug 29, 2023 03:14 PM IST

Ntini on Kohli: కోహ్లిని కెలికారో ఇక అంతే అంటూ సౌతాఫ్రికా బౌలర్లకు మాజీ పేసర్ మఖాయా ఎన్తిని వార్నింగ్ ఇచ్చాడు. అతన్ని ఏమీ అనకపోతే బోర్ అవుతాడని కూడా ఎన్తిని అనడం విశేషం.

కోహ్లితో పెట్టుకోవద్దంటూ సౌతాప్రికా బౌలర్లకు ఎన్తిని వార్నింగ్
కోహ్లితో పెట్టుకోవద్దంటూ సౌతాప్రికా బౌలర్లకు ఎన్తిని వార్నింగ్ (ANI)

Ntini on Kohli: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికా బౌలర్లకు ఆ టీమ్ మాజీ పేస్ బౌలర్ మఖాయా ఎన్తిని ఓ హెచ్చరిక జారీ చేశాడు. ఇండియాతో మ్యాచ్ లో విరాట్ కోహ్లిని ఒక్క మాట కూడా అనకూడదని స్పష్టం చేశాడు. ఒకవేళ నోరు జారారో.. ఇక అంతే అంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం. స్లెడ్జింగ్ చేయకపోతేనే కోహ్లి బోర్ గా ఫీలై త్వరగా ఔటవుతాడని ఎన్తిని అన్నాడు.

విరాట్ కోహ్లిని స్లెడ్జ్ చేస్తే అతడు మరింత రెచ్చిపోతాడని ఎన్నో సందర్భాల్లో తేలిందనీ ఎన్తిని చెప్పాడు. "విరాట్ కోహ్లిని స్లెడ్జ్ చేయొద్దు. కోహ్లిని ఏ బౌలర్ స్లెడ్జ్ చేసినా అతడు తగిన మూల్యం చెల్లిస్తాడు. ఒకవేళ అతన్ని ఏమీ అనకపోతే అతడే బోర్ గా ఫీలై ఔటవుతాడు" అని రెవ్‌స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఎన్తిని అన్నాడు.

"విరాట్ కోహ్లి గురించి ఒక విషయం చెప్పాలి. అతనికి బౌలింగ్ చేసే ప్రతి సౌతాఫ్రికా బౌలర్ కు ఒకటే చెబుతున్నాను. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా అనొద్దు. మళ్లీ చెబుతున్నాను. ఏదో ఒకటి అంటూ అతన్ని స్లెడ్జ్ చేయొద్దు. అలా చేస్తే అతని వలలో పడినట్లే.

అతడు స్లెడ్జింగ్ కోరుకుంటాడు. అలాంటి వాటినే అతడు ఇష్టపడతాడు. మీరు అతడు కోరుకుంది ఇచ్చారంటే మరింత చెలరేగిపోతాడు. మీరు మూల్యం చెల్లించుకుంటారు. అందుకే సైలెంట్ గా ఉండండి" అని ఎన్తిని అన్నాడు.

కోహ్లి బోర్ అవుతాడు: ఎన్తిని

బౌలర్లు ఏమీ అనకపోతే కోహ్లి బోర్ ఫీలై త్వరగా ఔటవుతాడని కూడా ఎన్తిని అనడం విశేషం. "బౌలర్లు ఏమీ అనకపోతే కోహ్లి బోర్ అవుతాడు. తన అత్యుత్తమ ఆట ఆడటానికి అతనికి ఫీల్డ్ లో కొంత యాక్షన్ కావాలి. ఒకవేళ అది దొరకకపోతే బోర్ అవుతాడు. అప్పుడే అతడు ఏదైనా తప్పు చేస్తాడు.

అలాంటి బ్యాటర్లతో స్మార్ట్ గా ఉండాలి. ఇతర బ్యాటర్లతో ఉన్నట్లు ఉండకూడదు. అందుకే అతనికి బౌలింగ్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉండి బోర్ ఫీలయ్యేలా చేయండి. అప్పుడే అతన్ని ఔట్ చేయడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది" అని ఎన్తిని తమ బౌలర్లకు సూచించాడు.

వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగబోయే ఈ టోర్నీలో ప్రతి టీమ్ మిగిలిన 9 జట్లతో ఆడుతుంది. అందులో భాగంగా సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్ నవంబర్ 5న జరుగుతుంది.

Whats_app_banner