తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: సర్ఫరాజ్ ఖాన్‌ ఆట తీరుపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అందుకే డీసీ వదులుకుందంటూ వివరణ

IPL 2024: సర్ఫరాజ్ ఖాన్‌ ఆట తీరుపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అందుకే డీసీ వదులుకుందంటూ వివరణ

Sanjiv Kumar HT Telugu

03 March 2024, 8:39 IST

google News
  • Sourav Ganguly About Sarfaraz Khan Batting: ఐపీఎల్ 2024 వేలానికి ముందు సర్ఫరాజ్ ఖాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ వద్దనుకోవాలనే నిర్ణయానికి వేనుక ఉన్న కారణాన్ని తాజాగా సౌరవ్ గంగూలి వివరించారు. సర్ఫరాజ్ ఖాన్ ఆటతీరుపై గంగూలీ కామెంట్స్ చేశారు.

సర్ఫరాజ్ ఖాన్‌ ఆట తీరుపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అందుకే డీసీ వదులుకుందంటూ వివరణ
సర్ఫరాజ్ ఖాన్‌ ఆట తీరుపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అందుకే డీసీ వదులుకుందంటూ వివరణ (Getty-Screengrab)

సర్ఫరాజ్ ఖాన్‌ ఆట తీరుపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అందుకే డీసీ వదులుకుందంటూ వివరణ

IPL 2024 Sourav Ganguly Sarfaraz Khan: రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 3వ మ్యాచ్‌లో భారతదేశం కోసం ఆడిన సర్ఫరాజ్ ఖాన్ తన డెబ్యూ ఎంట్రీ కల నెరవేర్చుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన 11 మంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో నాలుగు సంవత్సరాలు గడిపిన సర్ఫరాజ్.. మూడు సంవత్సరాల పాటు పంజాబ్ కింగ్స్‌కు వెళ్లి చివరికి రాజధానికి వెళ్లాడు.

అయితే, భారత దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ IPLలో అదే పంథాను కొనసాగించలేకపోయాడు. 2019 సర్ఫరాజ్ అత్యుత్తమ ఐపీఎల్ సీజన్. ఇక్కడ అతను 8 మ్యాచుల్లో 180 పరుగులు చేశాడు. అన్ని విధాలుగా, అతను చాలా అరుదుగా ఆటలు ఆడాడు కాబట్టి ఇది పూర్తిగా అతని తప్పు కాదు. ఐపీఎల్ 2022లో డీసీలో చేరాక.. రెండు సీజన్లలో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి 10 మ్యాచుల్లో 144 పరుగులు చేశాడు.

మరి అలాంటి సర్ఫరాజ్ ఖాన్‌కు డీసీలో ఐపీఎల్ కోసం ఎందుకు చోటు దక్కలేదు అనే ప్రశ్నలు తలెత్తాయి. సర్ఫరాజ్ ఖాన్‌ను ప్రధాన రెడ్ బాల్ ప్లేయర్‌గా డీసీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఎందుకు గుర్తించలేదు అని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సర్ఫరాజ్ ఖాన్‌ను డీసీ వదులుకోవడంపై వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు సౌరవ్ గంగూలీ.

"సర్ఫరాజ్ ఖాన్ చాలా సమర్థవంతమైన ఆటగాడు. అతడి ఆట టీ20 కంటే ఐదు రోజులు ఆడే టెస్ట్ ఫార్మాట్‌కు బాగా సరిపోతుంది. టీ20 ఒక భిన్నమైన ఫార్మాట్. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఎన్నో పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరఫున సర్ఫరాజ్ పరుగుల వరద పారించాడు. అది అసాధారణమైంది. ఓ ఆటగాడు సాధంచిన పరుగులు ఎప్పటికీ వృథా కాదు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో కూడా అదే జరిగింది" అని రేవ్ స్పోర్ట్స్‌తో సౌరవ్ గంగూలీ తెలిపారు.

గతేడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2024 వేలం జరిగినప్పుడు సర్ఫరాజ్ బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. కానీ ఆశ్చర్యంగా అతన్ని ఎవరు తీసుకోలేదు. కానీ రిపోర్టులను చూస్తే ఇంగ్లాండ్ పై ఆ రెండు అర్ధశతకాలు కొట్టిన తర్వాత అతని తలరాత మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి రవీంద్ర జడేజాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి దురదృష్టవశాత్తు 62 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మరో అర్ధశతకం సాధించడంతో ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది.

కానీ, ఆనందబజార్ పత్రిక గత నెలలో 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకోవడానికి మూడు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. సర్ఫరాజ్ తమ జట్టుకు బలం కాగలడని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ మేనేజ్మెంట్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీలో ఉన్న కారణంగా కేకేఆర్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. సర్ఫరాజ్‌పై ఆసక్తి చూపిన మరో జట్టు అతని మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ అని రాసుకొచ్చింది.

తదుపరి వ్యాసం