తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Slowest Century: 397 బాల్స్‌లో సెంచ‌రీ చేసిన టీమిండియా క్రికెట‌ర్ - టెస్ట్ చ‌రిత్ర‌లో అత్యంత జిడ్డు మ్యాచ్ ఇదే!

Slowest Century: 397 బాల్స్‌లో సెంచ‌రీ చేసిన టీమిండియా క్రికెట‌ర్ - టెస్ట్ చ‌రిత్ర‌లో అత్యంత జిడ్డు మ్యాచ్ ఇదే!

03 August 2024, 12:03 IST

google News
  • Slowest Century: 1992లో ఇండియా, జింబాబ్వే మ‌ధ్య జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌...టెస్ట్ హిస్ట‌రీలోనే జిడ్డు మ్యాచ్‌గా నిలిచింది. ఈ టెస్ట్‌లో టీమిండియా క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ 397 బాల్స్‌లో సెంచ‌రీ చేశాడు.

సంజ‌య్ మంజ్రేక‌ర్
సంజ‌య్ మంజ్రేక‌ర్

సంజ‌య్ మంజ్రేక‌ర్

Slowest Century: ప్ర‌స్తుతం క్రికెట్ ఆట తీరు మారిపోయింది. బ్యాట‌ర్ల‌దే అధిప‌త్యం క‌నిపిస్తోంది. హిట్ట‌ర్ల‌కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంటోంది. టెస్టులు కూడా టీ20లుగా మారిపోయాయి. జిడ్డుగా ఆడ‌టానికి క్రికెట‌ర్లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. జిడ్డుగా ఆడే క్రికెట‌ర్ల‌పై ఫ్యాన్స్ కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్నాయి.

జిడ్డు ఆట‌...

టెస్టుల్లో వ‌న్డే, టీ20 త‌ర‌హాలోనే సెంచ‌రీలు చేస్తోన్నారు. కొన్ని సార్లు ర‌న్స్ కంటే బాల్స్ త‌క్కువ‌గా క‌నిపిస్తోన్నాయి. అయితే టెస్టుల్లో టీమిండియా క్రికెట‌ర్ మాత్రం త‌న జిడ్డు ఆట‌తో అభిమానుల‌కే కాదు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. ఈ క్రికెట‌ర్ మ‌రేవ‌రో కాదు సంజ‌య్ మంజ్రేక‌ర్‌.

397 బాల్స్‌లో సెంచ‌రీ...

1992లో జింబాబ్వేతో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించ‌డానికి సంజ‌య్ మంజ్రేక‌ర్ ఏకంగా 397 బాల్స్ తీసుకున్నాడు. టెస్ట్ చ‌రిత్ర‌లో సెంచ‌రీ కోసం అతి ఎక్కువ బాల్స్ తీసుకున్న సెకండ్ క్రికెట‌ర్‌గా సంజ‌య్ మంజ్రేక‌ర్ నిలిచాడు. అంతే కాదు టెస్ట్ హిస్ట‌రీలో సెకండ్ స్లోయెస్ట్ సెంచ‌రీ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

169 ఓవ‌ర్లు...

ఈ మ్యాచ్‌లో 422 బాల్స్ ఎదుర్కొన్న సంజ‌య్ మంజ్రేక‌ర్ 104 ప‌రుగులు చేశాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌కు సంజ‌య్ మంజ్రేక‌ర్ చుక్క‌లు చూపించాడు. సంజ‌య్ మంజ్రేక‌ర్ ఒక్క‌డే దాదాపు 70 ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో 169 ఓవ‌ర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవ‌లం 307 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌల‌ర్ల అంద‌రి ఏకాన‌మీ రేటు ఒక్క ప‌రుగు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఎనిమిదిన్న‌ర గంట‌లు...

సెంచ‌రీ పూర్తిచేయ‌డానికి సంజ‌య్ మంజ్రేక‌ర్ ఎనిమిదిన్న‌ర గంట‌లు టైమ్ తీసుకున్నాడు. అత‌డి జిడ్డు బ్యాటింగ్‌పై అప్ప‌ట్లో టీమిండియా ఫ్యాన్స్ దారుణంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాట‌ర్లు కూడా పోటీ ప‌డి జిడ్డు బ్యాటింగ్ చేశారు. జింబాబ్వే ఓపెన‌ర్ కెవిన్ ఆర్నాట్ 176 బాల్స్‌లో 40 ర‌న్స్ చేశాడు. గ్రాంట్ ఫ్ల‌వ‌ర్ 297 బాల్స్‌లో 82 ప‌రుగులు చేశాడు. ఆండీ ఫ్ల‌వ‌ర్ 201 బాల్స్‌లో 59, హాగ్‌ట‌న్ 322 బాల్స్‌లో 121 ప‌రుగులు చేశారు.

టెస్ట్ చ‌రిత్ర‌లోనే జిడ్డు మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 456 ర‌న్స్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 146 ప‌రుగుల‌తో ఉన్న ద‌శ‌లో ఐదు రోజులు ముగియ‌డంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.అయితే టెస్టుల్లో స్లోయెస్ట్ సెంచ‌రీ రికార్డ్ పాకిస్థాన్‌కు చెందిన ముద‌స్సార్ నాజ‌ర్ పేరు మీద ఉంది. 1977లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో నాజ‌ర్ 419 బాల్స్‌లో సెంచ‌రీ సాధించాడు.

టాపిక్

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం