తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Run Out: “గిల్ అలా చేయాల్సింది”: రోహిత్ శర్మ రనౌట్‍పై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్

Rohit Sharma Run Out: “గిల్ అలా చేయాల్సింది”: రోహిత్ శర్మ రనౌట్‍పై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్

12 January 2024, 17:15 IST

    • Rohit Sharma Run Out - IND vs AFG: అఫ్గానిస్థాన్‍తో తొలి టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్‍గా వెనుదిరిగాడు. ఆ సందర్భంలో శుభ్‍మన్ గిల్‍పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయంపై భారత మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ మాట్లాడారు.
రోహిత్ శర్మ రనౌట్
రోహిత్ శర్మ రనౌట్ (AFP)

రోహిత్ శర్మ రనౌట్

Rohit Sharma Run Out - IND vs AFG: అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍లో భారత జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‍ల సిరీస్‍లో భాగంగా మొహాలీ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే రెండు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు. అయితే, రనౌత్ తర్వాత మరో ఎండ్‍లో ఉన్న శుభ్‍మన్ గిల్‍పై రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫజల్ హక్ బౌలింగ్‍లో బంతిని రోహిత్.. మిడ్ఆఫ్‍ వైపు ఆడగా.. ఫీల్డర్ దగ్గరికి వెళ్లింది. అయితే, ముందుగా రోహిత్‍ను చూడకుండా బంతినే చూస్తూ రన్‍కు వస్తున్నట్టు గిల్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ అమాంతం పరుగెత్తాడు. గిల్ మాత్రం క్రీజులోనే నిలబడ్డాడు. దీంతో హిట్‍మ్యాన్ రనౌట్ అయ్యాడు. పెవిలియన్‍కు వెళుతూ గిల్‍పై ఆగ్రహం వ్యక్తం చేశాడు రోహిత్. ఈ రనౌత్ తతంగంపై భారత మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

రోహిత్ శర్మ సింగిల్‍కు రమ్మనగానే శుభ్‍మన్ గిల్ రన్‍కు వెళ్లాల్సిందని పార్థివ్ పటేల్ చెప్పారు. రోహిత్‍ను అతడు నమ్మాల్సిందని చెప్పారు. కానీ గిల్ బంతిని చూస్తూ అలాగే నిలబడ్డాడని అన్నారు. వారిద్దరూ కలిసి టీ20ల్లో ఆడడం తొలిసారే అయినా.. వన్డేలు, టెస్టుల్లో కలిసి ఆడారు కదా అని పార్థివ్ గుర్తు చేశారు.

పూర్తి మిస్‍అండర్‌స్టాడింగ్ వల్లే రోహిత్ శర్మ రనౌట్ జరిగిందని పార్థివ్ పటేల్.. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో అన్నారు. “శుభ్‍మన్ గిల్.. రోహిత్ శర్మను నమ్మాల్సింది. అంతర్జాతీయ టీ20ల్లో వారు తొలిసారి కలిసి ఆడుతున్నారని నాకు తెలుసు. కానీ వన్డేలు, టెస్టుల్లో ఓపెనర్లుగా వారు కలిసి చాలా మ్యాచ్‍లు ఆడారు. వారి మధ్య మిస్‍అండర్‌స్టాడింగ్ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గిల్ బాల్‍ను చూస్తూనే ఉండిపోయాడు. అయితే, అతడు రోహిత్ శర్మ పిలిచినట్టు రన్‍కు వెళ్లాల్సింది” అని పార్థివ్ పటేల్ అన్నారు.

అదరగొట్టిన దూబే

అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యఛేదనలో భారత యంగ్ ఆల్‍రౌండర్ శివం దూబే 40 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేసి టీమిండియాను విజయ పథాన నడిపాడు. అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వికెట్ కీపింగ్ బ్యాటర్ జితేశ్ శర్మ (31) మెరిపించాడు. శుభ్‍మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), రింకూ సింగ్ (16 నాటౌట్) పర్వాలేదనిపించారు. 17.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 159 రన్స్ చేసి గెలిచింది భారత్. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహమ్మద్ నబీ (42) రాణించగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (23), ఇబ్రహీం జర్దాన్ (25), అజ్మతుల్లా జజాయ్ (29) మోస్తరుగా ఆడారు. చివర్లో నజ్మతుల్లా జర్దాన్ (19 నాటౌట్) మెరిపించడంతో అఫ్గాన్‍కు ఆ మాత్రం స్కోరు దక్కింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ చెరో రెండు, శివమ్ దూబే ఓ వికెట్ తీసుకున్నారు.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఆదివారం (జనవరి 14) ఇండోర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.

తదుపరి వ్యాసం