తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shreyas Iyer: రంజీ ట్రోఫీలో వంద స్ట్రైక్ రేట్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డ‌బుల్ సెంచ‌రీ - సెలెక్ట‌ర్ల‌కు అదిరిపోయే రిప్లై

Shreyas Iyer: రంజీ ట్రోఫీలో వంద స్ట్రైక్ రేట్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డ‌బుల్ సెంచ‌రీ - సెలెక్ట‌ర్ల‌కు అదిరిపోయే రిప్లై

08 November 2024, 14:04 IST

google News
  • ఐపీఎల్ వేలం ముందు డ‌బుల్ సెంచ‌రీతో టీమిండియా క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అద‌ర‌గొట్టాడు. ఒడిశాతో జ‌రుగుతోన్న రంజీ మ్యాచ్‌లో 228 బాల్స్‌లో 233 ప‌రుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇర‌వై నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్స‌ర్లు కొట్టాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌.

శ్రేయ‌స్ అయ్య‌ర్
శ్రేయ‌స్ అయ్య‌ర్

శ్రేయ‌స్ అయ్య‌ర్

రంజీ ట్రోఫీలో టీమిండియా క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అద‌ర‌గొట్టాడు. ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ఏ లో భాగంగా ఒడిశాతో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ దంచికొట్టాడు. 228 బాల్స్‌లో 233 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అత‌డి స్ట్రైక్ రేట్ 102.19గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ రంజీ మ్యాచ్‌లో 24 ఫోర్లు, తొమ్మిది సిక్స‌ర్ల కొట్టాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌. సిక్స‌ర్లు, ఫోర్ల‌తోనే 150 ప‌రుగులు చేశాడు.

602 ర‌న్స్‌...

శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు సిద్ధార్థ్ లాడ్ (169 ప‌రుగులు), ర‌ఘువ‌న్సీ(92 ర‌న్స్‌)తో రాణించ‌డంతో రంజీ మ్యాచ్‌లో ముంబాయి 123 ఓవ‌ర్ల‌లోనే 602 ప‌రుగులు చేసింది. కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ జోరుకు అడ్డుక‌ట్ట వేసేందుకు ఎనిమిది మంది బౌల‌ర్ల‌ను ప్ర‌యోగించాడు ఒడిశా కెప్టెన్ గోవింద పొద్దుర్‌. కానీ అత‌డి ప్ర‌య‌త్నాలు ఏవి ఫ‌లించ‌లేదు.

ఈ రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్‌లో ఒడిశా 285 ప‌రుగులు చేసింది. సందీప్ ప‌ట్నాయ‌క్ సెంచ‌రీతో ఒంట‌రి పోరాటం చేశాడు.

సెలెక్ట‌ర్ల‌కు స‌మాధానం...

ఇటీవ‌లే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం 18 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును సెలెక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. ఈ టీమ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. సెలెక్ట‌ర్ల తీరుపై త‌న డ‌బుల్ సెంచ‌రీతో శ్రేయ‌స్ అయ్య‌ర్ స‌మాధాన‌మిచ్చాడు క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. మ‌రోవైపు త్వ‌ర‌లోనే ఐపీఎల్ వేలం పాట జ‌రుగ‌నుంది.

ఐపీఎల్ 2024లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. జ‌ట్టును విన్న‌ర్‌గా నిలిపాడు. ఈ సీజ‌న్‌లో 351 ప‌రుగుల‌తో రాణించాడు.

నో రిటెయిన్‌...

ఐపీఎల్ 2025 కోసం కేకేఆర్ అత‌డిని రిటెయిన్ చేసుకోలేదు. ర‌సెల్‌, న‌రైన్‌, రింకు సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణాల‌ను తీసుకున్న కోల్‌క‌తా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు మొండిచేయి ఇచ్చింది. దాంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ రెండు ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలంలోకి రానున్నాడు. ఈ డ‌బుల్ సెంచ‌రీతో త‌న స‌త్తా ఏమిటో ఐపీఎల్ ఫ్రాంచైజ్‌ల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ చాటిచెప్పాడు.

ఈ వేలంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ భారీగానే ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఐపీఎల్ వేలంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్‌, రిష‌బ్ పంత్‌తో పాటు ప‌లువురు టీమిండియా స్టార్ క్రికెట‌ర్లు ఎన్ని కోట్ల‌కు అమ్ముడుపోతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఐపీఎల్ వేలం న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో జ‌రుగ‌నుంది.

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం