తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ మొదలు.. పూజా కార్యక్రమాలతో..: వివరాలివే

Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ మొదలు.. పూజా కార్యక్రమాలతో..: వివరాలివే

25 October 2023, 14:52 IST

google News
    • Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ సినిమా చిత్రీకరణ మొదలైంది. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. వివరాలివే..
Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ మొదలు
Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ మొదలు

Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ మొదలు

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‍తో నేచులర్ స్టార్ నాని హీరో మూవీగా రూపొందనుంది. వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని - ఆత్ర్యే కాంబినేషన్‍లో వచ్చిన ‘అంటే.. సుందరానికి’ సినిమా గతేడాది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కోసం వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కాగా, సోమవారం దసరా సందర్భంగా వచ్చిన ఈ సినిమా అన్‍చైన్డ్ గ్లింప్స్ వీడియో చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. నేడు (అక్టోబర్ 24) సరిపోదా శనివారం సినిమా లాంఛనంగా మొదలైంది. ఆ వివరాలివే..

‘సరిపోదా శనివారం’ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‍లో నేడు గ్రాండ్‍గా జరిగాయి. దీంతో విజయ దశమి రోజున ఈ మూవీ అధికారికంగా లాంచ్ అయింది. ముహూర్తం సీన్‍కు ప్రముఖ నిర్మాత దిల్‍ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‍కు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. తొలి షాట్‍కు ఎస్‍జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎస్‍జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు.

సరిపోదా శనివారం’ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. గ్యాంగ్‍‍లీడర్ తర్వాత నాని - ప్రియాంక మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా.. ‘సరిపోదా శనివారం’ సినిమాను కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందించనున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ.

డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య.. సరిపోదా శనివారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే ఉండనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. సరిపోదా శనివారం చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించనున్నారు. మురళీ జీ సినిమాటోగ్రఫీ చేయనున్నారు.

నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించగా.. నాని కూతురి పాత్ర పోషించారు బేబి కియారా ఖన్నా. శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. హేషన్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. హాయ్ నాన్న నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం