Nani Saripodha Sanivaaram Movie: నాని సరిపోదా శనివారం ఫస్ట్ లుక్ రిలీజ్ - ఈ సారి జోనర్ మార్చిన వివేక్ ఆత్రేయ
Nani Saripodha Sanivaaram Movie: నాని హీరోగా నటిస్తోన్న 31వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను దసరా కానుకగా సోమవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nani SaripodhaSanivaaram Movie: నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తోన్న తాజా సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా సోమవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. వీటితో పాటు నాని అన్‌చైన్‌డ్ పేరుతో రిలీజ్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో చీకటితో నిండిన గొడౌన్‌లో నాని కట్టిపడేసి కనిపిస్తున్నాడు.
పెద్దలు ఒక మాట అనేవాళ్లు. రాజుకైనా బంటుకైనా...ఎలాంటివాడికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూడాలి...అదే మాటను కొత్త తరం కుర్రాళ్లు కొంచెం మార్చి. నీకంటూ ఓ టైమ్ వస్తుంది. అందాక మూసుకొని వెయిట్ చేయ్ అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ తరం వాడైనా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే ఆ ఒక్క రోజు కోసమే ఈ కథ. అలాంటి రోజు...ఆ ఒక్క రోజు...ఒకడికి వారానికి ఒక రోజు వస్తే...వాడిని ఎవరైనా ఆపాలని అనుకోగలరా...అనుకున్నా ఆపగలరా....శనివారం...ప్రతిశనివారం సరిపోతుందా...అంటూ ఈ వీడియోలో సాయికుమార్ చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని పంచుతోన్నాయి.
హీరోయిజం పీక్స్…
ఒంటిపై గాయాలతో ఈ వీడియోలో నాని కనిపిస్తున్నారు. గొడౌన్ డోర్ బద్దలు కొట్టుకుంటూ నాని బయటకు రావడం, అతడి కోసం వర్షంలోనే కొందరు జనాలు ఎదురుచూస్తుండటం, నానిని చూడగానే వారి ముఖంలో భయంపోయి నవ్వులు కనిపించడం ఈ వీడియోకు హైలైట్‌గా నిలుస్తోంది. ఈ వీడియోలోనే నాని హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.
ఇప్పటివరకు సాఫ్ట్ కామెడీ మూవీస్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ సారి జోనర్ మార్చి యాక్షన్ కథాంశంతో ఈ సినిమా చేయబోతున్నట్లుగా ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతికి ఉన్న సంకెళ్లను తెచ్చుకుంటూ రౌద్రంగా నాని కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో నాని కనిపించబోతున్నాడు. సరిపోదా? ఆయుధ పూజతో ఆరంభం అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టైటిల్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
నాని లాంటి ఇమేజ్ ఉన్న నటుడి మూవీకి ఇలాంటి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేయడం ఆసక్తి కరంగా మారింది. సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య కీలక పాత్రను పోషించనున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ఇది. నాని హీరోగా నటిస్తోన్న 31వ సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.