Rohit Sharma: ఐపీఎల్‌లో సెంచరీ చేయడంతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన క్రికెటర్లు ముగ్గురే - వాళ్లు ఎవరంటే?
18 April 2024, 9:14 IST
Rohit Sharma: ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన క్రికెటర్లు ముగ్గురే ఉన్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
రోహిత్ శర్మ
Rohit Sharma: టీ20 క్రికెట్ ఎవరు ఎప్పుడు చెలరేగుతారు ఊహించడం కష్టమే. బౌలర్లు అనుకున్న వాళ్లు బ్యాటర్లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. బ్యాటర్లు బౌలింగ్‌లో అదరగొట్టిన రికార్డులు ఐపీఎల్‌లో చాలానే ఉన్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకు 16 సీజన్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం పదిహేడోవ సీజన్ జరుగుతోంది. ఈ పదిహేడేళ్లలో ఐపీఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎన్నో అరుదైన రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ బౌలింగ్‌లో సెంచరీ చేయడంతో బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన క్రికెటర్లు మాత్రం పదిహేడు సీజన్స్‌లో కలిపి ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరంటే?
రోహిత్ శర్మ...
ఐపీఎల్‌లో తన అసాధారణ బ్యాటింగ్‌తో ఎన్నో అరుదైన రికార్డులను రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. బ్యాటింగ్‌లో పరుగుల వరదను పారించడమే కాకుండా ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. అయితే రోహిత్ శర్మ చాలా మందికి బ్యాటర్‌గానే తెలుసు. కానీ అతడి కెరీర్ మాత్రం బౌలర్‌గా ప్రారంభమైంది. స్పిన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ ఆ తర్వాత బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాడు.
అయితే అప్పుడప్పుడు తనలోని స్పిన్ టాలెంట్‌ను వెలికిలోకి తీస్తుంటాడు. ఐపీఎల్ 2009 సీజన్‌లో రోహిత్ శర్మ దక్కన్ ఛార్జర్స్ టీమ్ తరఫున ఐపీఎల్ 2009లో బరిలో దిగిన రోహిత్ శర్మ బౌలింగ్‌లో హ్యాట్రిక్ తీశాడు. అది కూడా ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేయడంతో పాటు హ్యాట్రిక్ తీసిన క్రికెటర్‌గా నిలిచాడు.
సునీల్ నరైన్...
2024 సీజన్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు కోల్‌కతా ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఐపీఎల్‌లో ఇదే అతడికి ఫస్ట్ సెంచరీ కావడం గమనార్హం. ఈ సీజన్‌లో బ్యాటింగ్ అదరగొడుతూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు.
ఐపీఎల్‌లో 2013లో పంజాబ్ కింగ్స్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు సునీల్ నరైన్. అతడు కూడా ఐపీఎల్‌లో సెంచరీతో పాటు హ్యాట్రిక్ తీసిన క్రికెటర్ల జాబితాలో ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 168 మ్యాచ్‌లు ఆడిన సునీల్ నరైన్ 1322 రన్స్, 170 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2024లో 276 రన్స్ చేయడంతో పాటు ఏడు వికెట్లు తీశాడు సునీల్ నరైన్.
షేన్ వాట్సన్...
చెన్నై కి జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కూడా ఐపీఎల్‌లో హ్యాట్రిక్ నమోదు చేయడంలో పాటు సెంచరీ సాధించాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హ్యాట్రిక్ తీశాడు వాట్సన్. చెన్నైకి మారిన తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. 145 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 3874 రన్స్‌తో పాటు 92 వికెట్లు తీశాడు. ఐపీఎల్ షేన్ వాట్సన్ నాలుగు సెంచరీలు చేశాడు.