Richest Cricketer Retires: ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇతడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్.. సంపద రూ.70 వేల కోట్లు
03 December 2024, 9:51 IST
- Richest Cricketer Retires: ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఊహించని రీతిలో ఆటకు గుడ్ బై చెప్పిన విషయం మీకు తెలుసా? అతని వయసు కేవలం 22 ఏళ్లు కాగా.. సంపద విలువ ఏకంగా రూ.70 వేల కోట్లు కావడం విశేషం. ఇంతకీ ఎవరతను?
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇతడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్.. సంపద రూ.70 వేల కోట్లు
Richest Cricketer Retires: ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ధోనీలాంటి వాళ్ల పేర్లు గుర్తుకు వస్తాయి కానీ.. వీళ్లెవరూ కాదు. ఆ క్రికెటర్ ఇప్పుడు 22 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని పేరు ఆర్యమాన్ బిర్లా. బిలియనీర్ కుమార మంగళం బిర్లా తనయుడు అతడు. ఆర్యమాన్ క్రికెట్ జర్నీ ఇంట్రెస్టింగా ఉంటుంది.
ఎవరీ ఆర్యమాన్ బిర్లా?
దేశంలోనే అత్యంత సంపద కలిగిన వ్యాపారవేత్తల్లో ఒకరు కుమార మంగళం బిర్లా. సాధారణంగా అలాంటి వాళ్ల వారసులు కూడా వ్యాపారాల్లోనే కొనసాగుతారు. కానీ ఆర్యమాన్ బిర్లా మాత్రం క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడం విశేషం. అయితే గతేడాది అతన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ లోని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్ కు డైరెక్టర్ ను చేశారు.
అంతేకాదు ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కు కూడా అతడే డైరెక్టర్. ఈ బాధ్యతలు రావడంతో అతడు కేవలం 22 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
రంజీ కెరీర్ ఇలా..
ఆర్యమాన్ 1997లో ముంబైలో జన్మించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని రేవాకు వెళ్లాడు. అక్కడే ఆదిత్య బిర్లా గ్రూపు సిమెంట్ యూనిట్ ఉంటుంది. మధ్యప్రదేశ్ లోనే జూనియర్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆర్యమాన్.. తర్వాత మెల్లగా రంజీ ట్రోఫీ స్థాయికి ఎదిగాడు. 2017లో తొలిసారి మధ్యప్రదేశ్ తరఫున ఒడిశాపై రంజీ మ్యాచ్ ఆడాడు.
ఆ మ్యాచ్ లో వరుసగా 16, 6 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఏడాది తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఆర్యమాన్ తొలి సెంచరీ చేశాడు. బెంగాల్ తో మ్యాచ్ లో అతడు 103 రన్స్ చేయడం విశేషం.
ఐపీఎల్లో ఆర్యమాన్ ఇలా..
2018లో రంజీ ట్రోఫీ సెంచరీ తర్వాత అదే ఏడాది రాజస్థాన్ రాయల్స్ అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు జట్టుతోనే ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఎప్పుడూ చోటు దక్కించుకోలేకపోయాడు. వరుస గాయాలు కూడా కావడంతో జనవరి, 2019 తర్వాత అతడు అసలు క్రికెట్ ఆడలేకపోయాడు.
అదే ఏడాది డిసెంబర్ లో నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పిన ఆర్యమాన్ మళ్లీ క్రికెట్ ఆడలేదు. మెల్లగా ఫ్యామిలీ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం అతని సంపద విలువ రూ.70 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ అతడు. అతని తర్వాత సచిన్, ధోనీ, కోహ్లిలాంటి ప్లేయర్స్ ఉన్నారు.