తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Glenn Maxwell : మ్యాక్స్​వెల్​ని విమర్శించిన ఆర్సీబీ మాజీ ప్లేయర్​పై ట్రోల్స్​ వర్షం!

Glenn Maxwell : మ్యాక్స్​వెల్​ని విమర్శించిన ఆర్సీబీ మాజీ ప్లేయర్​పై ట్రోల్స్​ వర్షం!

Sharath Chitturi HT Telugu

05 May 2024, 13:39 IST

  • Glenn Maxwell IPL 2024 : ఆర్సీబీ బ్యాటర్​, ఔట్​ ఆఫ్​ ఫార్మ్​లో ఉన్న గ్లెన్​ మ్యాక్స్​వెల్​ని ఆ జట్టు మాజీ ప్లేయర్​ విమర్శించాడు. అది.. నెటిజన్లకు నచ్చలేదు! ఇప్పుడు.. అతడినే ట్రోల్​ చేస్తున్నారు.

గ్లెన్​ మ్యాక్స్​వెల్​..
గ్లెన్​ మ్యాక్స్​వెల్​.. (Idrees MOHAMMED / AFP)

గ్లెన్​ మ్యాక్స్​వెల్​..

Parthiv Patel Glenn Maxwell : ఐపీఎల్​ 2024లో తన చెత్త ప్రదర్శనతో విపరీతమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు ఆర్సీబీ డ్యాషింగ్​ బ్యాటర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. అతని ప్రదర్శనపై అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ ఓపెనర్​, టీమిండియా మాజీ ప్లేయర్​ పార్థివ్​ పటేల్​ తాగాగా చేరాడు. కానీ.. మ్యాక్స్​వెల్​ ఓవరేటెడ్​ ప్లేయర్​ అన్న పార్థివ్​ పటేల్​ని నెటిజన్లు.. ట్రోల్​ చేయడం మొదలుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

మ్యాక్స్​వెల్​పై పార్థివ్​ పటేల్​ కామెంట్స్​..

ఐపీఎల్​ 2024లో గ్లెన్ మాక్స్​వెల్​ ప్రదర్శనపై.. ట్విట్టర్​లో ఒక పోల్​ పెట్టాడు పార్థివ్​ పటేల్​. మాక్స్​వెల్ ఆస్ట్రేలియా దిగ్గజం? లేదా గొప్ప ఐపీఎల్ ఆటగాడు? అని రెండు ఆప్షన్స్​ ఇచ్చి.. ఒకదానిని ఎంచుకోమన్నాడు. 

చాలా మంది.. మ్యాక్స్​వెల్​.. ఆస్ట్రేలియాకి గొప్ప ప్లేయర్​ అని స్పందించారు.

ఈ విషయంపై స్పందించాడు పార్థివ్​ పటేల్​.

Glenn Maxwell RCB 2024 : "నా పాయింట్ కూడా ఇదే. మ్యాక్స్​వెల్​ తన అంతర్జాతీయ ప్రదర్శనని ఐపీఎల్​లో చూపించలేకపోతున్నాడు. ఫ్రాంఛైజీల్లో అతనికి లభించిన అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే.. అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది," అని పార్థివ్ చెప్పుకొచ్చాడు.

పార్థివ్​ పటేల్​పై ట్రోల్స్​..

అయితే.. ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ వికెట్ కీపర్ మాటలు.. నెటిజన్లకు పెద్దగా నచ్చలేదు. ఓ సోషల్ మీడియా యూజర్​.. పటేల్ గురించి అడిగిన మరో పోల్ స్క్రీన్ షాట్​ను షేర్ చేశారు.

పార్థివ్​ పటేల్​.. 'గ్రేట్ ప్లేయర్ ఆఫ్ ఇండియా', 'గ్రేట్ ఐపీఎల్ ప్లేయర్', ' వీటిల్లో ఏదీ కాదు' అనే మూడు ఆప్షన్స్​లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని కోరారు. 80 శాతం మంది.. 'వీటిల్లో ఏదీ కాదు' అన్న ఆప్షన్​ని ఎంచుకున్నారు!

Parthiv Patel trolling : "ముందు వెళ్లి అతని (పార్థివ్​) స్టాట్స్​ చూడండి ... పవర్​ప్లేలో ఓపెనర్​గా ఎన్ని పరుగులు చేశాడు?' అని నెటిజన్​ పార్థివ్​ పటేల్​ని ట్రోల్​ చేశాడు.

'ఐపీఎల్ కెరీర్​లో మీరు చేసిన దానికంటే.. కేవలం ఆర్సీబీ తరఫున బ్యాటింగ్ ఆర్డర్​లో ఎక్కువ హాఫ్ సెంచరీలు సాధించాడు మ్యాక్స్​వెల్​' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

'ఈ సీజన్ మినహా ప్రస్తుత ఫ్రాంచైజీకి అతను బాగానే ఉన్నాడు, దయచేసి ఈ అజెండాను ఆపండి' అని మరొకరు కామెంట్ చేశారు.

'ఆస్ట్రేలియాతో కలిసి మ్యాక్సీ ఎక్కువ విజయాలు సాధించాడు, రాణించాడు. దీని అర్థం అతను ఆర్సీబీ తరఫున తక్కువ ప్రదర్శన చేశాడని కాదు. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆటగాళ్లంతా సమానం కాదు' అని మరొకరు కామెంట్ చేశారు.

ఐపీఎల్ 2024లో..

RCB IPL 2024 : గ్లెన్ మ్యాక్స్​వెల్ ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఘోరమైన ప్రదర్శన చేశాడు. 7 ఇన్నింగ్స్​లలో 5.14 సగటుతో 36 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 97.29గా ఉంది. 5 ఇన్నింగ్స్​లలో 20.80 సగటుతో 5 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు 8.66గా ఉంది. తన ఐపీఎల్ కెరీర్​లో ఈ ఆస్ట్రేలియా ఆటగాడు 132 మ్యాచుల్లో 25.05 సగటుతో 2,755 పరుగులు చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్ స్ట్రైక్ రేట్ 156.36గా ఉంది.

తదుపరి వ్యాసం