Maxwell RCB : ‘నన్ను తీసేయమని నేనే చెప్పా’- ఐపీఎల్ 2024 నుంచి బ్రేక్ తీసుకుంటున్న మ్యాక్స్‌వెల్!
Maxwell IPL 2024 : ఐపీఎల్ 2024 నుంచి నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్టు చెప్పాడు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్. ఇందుకు గల కారణాన్ని వివరించాడు.

RCB vs SRH IPL 2024 : ఐపీఎల్ 2024లో పరాజయాల పరంపర కొనసాగిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో షాక్! ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఈ సీజన్లో ఘోరంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్ 2024 నుంచి నిరవధిక బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే.. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడలేదు. అంతేకాదు.. తానే స్వయంగా వెళ్లి, జట్టులో ఎంపిక చేయొద్దని చెప్పినట్టు వివరించాడు ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్.
మ్యాక్స్‌వెల్ ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నాడు?
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ కొట్టిన టీమ్‌గా నిలిచింది ప్యాట్ కమిన్స్ సేన. ఆర్సీబీ బ్యాటర్లు పోరాడినా.. అంతటి భారీ టార్గెట్‌ను ఛేదించలేకపోయారు.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు మ్యాక్స్‌వెల్. మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు, అందుకే.. ఐపీఎల్ 2024 నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు వెల్లడించాడు.
Maxwell RCB latest news : "నా మానసిక- భౌతిక పరిస్థితి అంత మెరుగ్గా లేదు. అందుకే బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా ఇది నాకు సులభమైన నిర్ణయం కాదు. కానీ తప్పలేదు. ఫాఫ్ డూప్లెసిస్ (ఆర్సీబీ కెప్టెన్), కోచ్‌ల దగ్గరికి వెళ్లి.. నన్ను తీసేయాలని నేనే చెప్పాను. ఇలాంటి పరిస్థితి నాకు గతంలోనూ ఎదురైంది. ఇలాంటి పరిస్థితిలో ఎంత ఎక్కువ ఆడితే, అంత దారుణంగా ఉంటుంది. అందుక.. భౌతికంగా బ్రేక్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. నా బాడీని సరిగ్గా చూసుకోవాలనుకుంటున్నాను. టోర్నీలో ఎప్పుడైనా నా అవసరం ఉండి.. మళ్లీ వచ్చి మంచి ప్రదర్శన చేసేందుకు రెడీ అవ్వాలి." అని చెప్పుకొచ్చాడు మ్యాక్స్‌వెల్.
ఇదీ చూడండి:- RCB bowlers : ‘టీ20ల్లో 300 కొట్టేది.. ఆర్సీబీ బౌలర్సే’- సోషల్ మీడియోలో పేలుతున్న మీమ్స్!
"పవర్‌ప్లే తర్వాత జట్టు ప్రదర్శనలో లోటు కనిపిస్తోంది. ఆ సమయంలో ఆడటం నా బలం. కానీ ఇప్పుడు నేను పెద్దగా బ్యాట్‌తో జట్టుకు సాయపడలేకపోతున్నాను. అందుకే.. వేరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపించింది," అని ఆర్సీబీ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ అన్నాడు.
RCB IPL 2024 : నిజంగానే.. ఈ సీజన్లో మ్యాక్స్‌వెల్ ఘోర ప్రదర్శన చేశాడు. ఆడిన 6 మ్యాచ్‌లలో 3సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన మ్యాచ్‌లలో కనీసం 30 కూడా దాటలేదు. 'వస్తాడు.. ఔట్ అవుతాడు.. రిపీట్' అని మ్యాక్స్‌వెల్ మీద సైటర్లు వెల్లువెత్తాయి.
అయితే.. మానసిక ఒత్తిడి కారణంతో మ్యాక్స్‌వెల్.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలా చేశాడు.
కానీ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఆడకపోవడానికి బాధపడినట్టు చెప్పాడు మ్యాక్స్‌వెల్.
"పవర్‌ప్లే సమయంలో పిచ్ అనుకున్నంత నెమ్మదిగా లేదని అనిపించింది. ఈ గేమ్ మిస్ చేసుకున్నానని అనిపించింది. ఈ మ్యాచ్‌లో నేను ఆడి ఉంటే బాగుండేది," అని చెప్పుకొచ్చాడు మ్యాక్స్‌వెల్.
టేబుల్ బాటమ్‌లో ఆర్సీబీ..
IPL 2024 points table : ఎస్ఆర్హెచ్తో ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరడం మరింత కష్టంగా మారింది. 7 మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి.. టేబుల్ చివరి స్థానంలో ఉంది ఆర్సీబీ. ప్లేఆఫ్‌కు చేరాలంటే.. ఇప్పటి నుంచి మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి. అప్పటికీ.. డైరక్ట్‌గా ప్లేఆఫ్‌లో ఛాన్స్ దక్కకపోవచ్చు. ఇతర జట్ల రన్‌రేట్‌పై భారీగా ఆధారపడాల్సి ఉంటుంది. మరి ఆర్సీబీ ఏం చేస్తుందో చూడాలి.
సంబంధిత కథనం