తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Shami Wife: మా ఆయన బాగా ఆడితే మంచిదే కదా.. బాగా డబ్బులు వస్తాయి: షమి భార్య

Mohammed Shami wife: మా ఆయన బాగా ఆడితే మంచిదే కదా.. బాగా డబ్బులు వస్తాయి: షమి భార్య

Hari Prasad S HT Telugu

08 November 2023, 16:48 IST

google News
    • Mohammed Shami wife: మా ఆయన బాగా ఆడితే మంచిదే కదా.. బాగా డబ్బులు వస్తాయి అని మహ్మద్ షమి భార్య హసీన్ జహాన్ అనడం విశేషం. వరల్డ్ కప్ 2023లో షమి కళ్లు చెదిరే ఫామ్ లో ఉండటంపై ఆమె స్పందించింది.
భార్య హసీన్ జహాన్ తో మహ్మద్ షమి (ఫైల్ ఫొటో)
భార్య హసీన్ జహాన్ తో మహ్మద్ షమి (ఫైల్ ఫొటో)

భార్య హసీన్ జహాన్ తో మహ్మద్ షమి (ఫైల్ ఫొటో)

Mohammed Shami wife: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ 2023లో చెలరేగిపోతుండటంపై అతని భార్య హసీన్ జహాన్ స్పందించింది. క్రికెట్ గురించి తనకు పెద్దగా తెలియదంటూనే.. అతడు బాగా ఆడితే బాగా డబ్బులు వస్తాయి.. తమ భవిష్యత్తు బాగుంటుందని ఆమె అనడం విశేషం. వరల్డ్ కప్ లో కేవలం 4 మ్యాచ్ లే ఆడిన షమి 16 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా హసీన్ జహాన్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ షమి పర్ఫార్మెన్స్ పై మాట్లాడింది. ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఓ క్రికెటర్ భార్య అయినా కూడా తనకు క్రికెట్ గురించి ఏమీ తెలియదని ఆమె అనడం విశేషం. అదే సమయంలో భర్తకు దూరంగా ఉంటున్నా.. అతడు బాగా ఆడితే తమకే మంచిది కదా అని కూడా ఆమె అంటోంది.

షమికి చెప్పను.. టీమిండియాకు ఆల్ ద బెస్ట్: హసీన్ జహాన్

"నేను క్రికెట్ చూడను. నేను క్రికెటర్లకు అభిమానిని కూడా కాదు. నాకు క్రికెట్ అర్థం కాదు. అందువల్ల అతని పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలియదు. అయితే అతడు బాగా ఆడితే టీమ్ లో చోటు ఖాయం చేసుకుంటాడు. అది అతడు మరింత సంపాదించడానికి, మా భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉండటానికి పనికొస్తుంది. అంతకు మించి కావాల్సింది ఏముంది" అని హసీన్ జహాన్ అనడం విశేషం.

కొంతకాలంగా షమికి దూరంగా ఉంటున్నా కూడా హసీన్ మాత్రం మా భవిష్యత్తు అంటూ ఇద్దరినీ కలిపి మాట్లాడటం గమనార్హం. ఇక తాను షమికి ఆల్ ద బెస్ట్ చెప్పనని, టీమిండియాకు మాత్రం చెబుతానని ఆమె ఇదే ఇంటర్వ్యూలో చెప్పింది. కొన్నేళ్ల కిందట షమిపై హసీన్ తీవ్ర ఆరోపణలు చేసింది. అతనిపై గృహ హింస కేసు కూడా పెట్టింది.

తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని.. వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని హసీన్ అప్పట్లో ఆరోపించింది. ఇప్పటికీ తన భార్య వేసిన కేసులపై షమి కోర్టుల్లో ఫైట్ చేస్తూనే ఉన్నాడు.

తదుపరి వ్యాసం