Shami to South Africa: ఎప్పుడూ 400 కొట్టే వాళ్ల పరిస్థితి ఎలా అయిందో చూశావా: సౌతాఫ్రికాకు షమి పంచ్-shami to south africa this is the situation of the team who scored over 400 runs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shami To South Africa: ఎప్పుడూ 400 కొట్టే వాళ్ల పరిస్థితి ఎలా అయిందో చూశావా: సౌతాఫ్రికాకు షమి పంచ్

Shami to South Africa: ఎప్పుడూ 400 కొట్టే వాళ్ల పరిస్థితి ఎలా అయిందో చూశావా: సౌతాఫ్రికాకు షమి పంచ్

Hari Prasad S HT Telugu
Nov 06, 2023 02:23 PM IST

Shami to South Africa: ఎప్పుడూ 400 కొట్టే వాళ్ల పరిస్థితి ఎలా అయిందో చూశావా అంటూ సౌతాఫ్రికాకు మహ్మద్ షమి సూపర్ పంచ్ ఇచ్చాడు. సఫారీలను 83 పరుగులకే కుప్పకూల్చిన తర్వాత షమి ఈ కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత మహ్మద్ షమి
సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత మహ్మద్ షమి

Shami to South Africa: వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికాను ఏకంగా 243 పరుగులతో చిత్తు చేసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి వాళ్లకు ఓ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ప్రతి మ్యాచ్ లో 400 స్కోరు దాటే వాళ్ల పరిస్థితి ఇలా అయిందని అతడు అనడం విశేషం. ఈ వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ భారీ స్కోర్లు చేసింది.

సౌతాఫ్రికా టీమ్ ఆస్ట్రేలియాపై 428, ఇంగ్లండ్ పై 399, బంగ్లాదేశ్ పై 382 రన్స్ చేసింది. అయితే ఇండియాతో మ్యాచ్ లో 327 పరుగులు చేజింగ్ లో మాత్రం కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్ తర్వాత షమి ఇలా వాళ్లకు పంచ్ ఇచ్చాడు. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తో ఫోన్లో మాట్లాడుతూ షమి ఈ కామెంట్స్ చేశాడు.

"మీరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలను ఓడించారు. ఈ టీమ్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. చంద్రుని మీది నుంచా" అని ఫోన్లో కైఫ్ అడిగాడు. దీనికి షమి స్పందిస్తూ.. "ప్రతిసారీ 400కుపైగా కొట్టే వాళ్ల పరిస్థితి ఎలా మారిందో చూశావా" అని నవ్వుతూ అన్నాడు. దీనికి కైఫ్ కూడా గట్టిగా నవ్వేశాడు. ఈ వరల్డ్ కప్ మొదటి 4 మ్యాచ్ లకు దూరంగా ఉన్న షమి.. తర్వాత రెచ్చిపోతున్నాడు.

ఈ వరల్డ్ కప్ నాలుగు మ్యాచ్ లలో అతడు ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. మొదటి మ్యాచ్ లో 5, రెండో మ్యాచ్ లో 4, మూడో మ్యాచ్ లో 5, నాలుగో మ్యాచ్ లో 2 వికెట్లు తీశాడు. షమి పేస్ కి ప్రత్యర్థులు వణికిపోతున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా, ఆరో బౌలర్ లేని లోటు తెలియడం లేదు. బుమ్రా, సిరాజ్, షమి, జడేజా, కుల్దీప్ లతో కూడిన ఐదుగురు బౌలర్ల అటాక్.. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది.

సౌతాఫ్రికాతో మ్యాచ్ లో జడేజా 5 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. మొదట్లోనే నిప్పులు కురిపిస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్న బుమ్రా.. తర్వాత సిరాజ్, షమిలాంటి వాళ్లు వికెట్లు తీయడంలో సహకరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లోనూ షమి 2 వికెట్లు తీశాడు.