తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jpl League: జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఫిక్స్ - ట్రోఫీని ఆవిష్క‌రించిన ఎమ్మెస్కే ప్ర‌సాద్‌

Jpl League: జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఫిక్స్ - ట్రోఫీని ఆవిష్క‌రించిన ఎమ్మెస్కే ప్ర‌సాద్‌

14 July 2024, 22:10 IST

google News
  • Jpl League:  కేఎస్‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌ (జేపీఎల్‌) ఈ నెల 20 నుంచి 25 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. ఈ టోర్నీలో మొత్తం ప‌ది టీమ్‌లు పాల్గొన‌నున్నాయి. జేపీఎల్ ట్రోఫీని ఆదివారం బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, శాట్జ్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి ఆవిష్క‌రించారు.

జేపీఎల్ లీగ్‌
జేపీఎల్ లీగ్‌

జేపీఎల్ లీగ్‌

కేఎస్‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌ (జేపీఎల్‌) ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రీమియ‌ర్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్బీ స్టేడియంలోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ వేడుకకు బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, శాట్జ్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ట్రోఫీలను ఆవిష్కరించారు.

ప‌ది టీమ్‌లు...

ఈ జేపీఎల్ ప్రీమియ‌ర్ లీగ్‌లో మొత్తం ప‌ది జ‌ట్లు పాల్గ‌న‌నున్నాయి ఆదివారం ట్రోఫీ ఆవిష్క‌ర‌ణ వేడుక అనంత‌రం కేఎస్‌జీ సంస్థ చైర్మన్‌, ఇండి రేసింగ్‌ టీమ్ ఓనర్ కె.అభిషేక్‌ రెడ్డి,, త్రుక్ష ఫుడ్స్‌ ఎండీ సీహెచ్. భరత్‌ రెడ్డి, లైఫ్‌స్పాన్‌ ప్రతినిధి భరణి 10 జట్ల కెప్టెన్లకు క్యాప్స్‌ ప్రదానం చేశారు.

జూలై 20 నుంచి

కేఎస్‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్ టీ20 లీగ్ ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్‌లో జ‌రుగ‌నున్న‌ట్లు నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు. ఈ టీ20 టోర్నీలో మొత్తం పది మీడియా సంస్థలకు చెందిన జట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి.

క్రీడా జ‌ర్న‌లిస్టుల‌తోనే సాధ్యం...

ట్రోఫీ ఆవిష్కరణ త‌ర్వాత‌ ఎమ్మెస్కే ప్ర‌సాద్‌ మాట్లాడుతూ ప్రొఫెషనల్‌ పద్ధతిలో జర్నలిస్టులు క్రికెట్‌ ఆడనుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏ క్రీడలోనైనా వర్ధమాన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావాలంటే అది క్రీడా జర్నలిస్టులతోనే సాధ్యమని, వారి కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి, గౌరవించాల‌ని ఎమ్మెస్కే ప్ర‌సాద్ అన్నాడు. . శివసేనారెడ్డి మాట్లాడుతూ జేపీఎల్‌తో క్రీడల ప్రాధాన్యత, అవశ్యకతపై ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్లనుందని చెప్పారు. శాట్జ్‌ తరఫున పూర్తి సహాయసహకారలందిస్తామని హామీ ఇచ్చారు.

జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఆట‌విడుపు...

అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఈ జ‌ర్న‌లిస్ట్ ప్రీమియ‌ర్‌ లీగ్‌తో కొంత ఆటవిడుపు లభించ‌డం ఖాయ‌మ‌ని అన్నాడు. జేపీఎల్ లీగ్‌లో ఆడుతున్న అన్ని టీమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. భరత్‌ రెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోరే జర్నలిస్టులందరూ ఇలా ఒకే వేదికపై కలిసి, లీగ్‌లో ఆడనుండడం కనులపండుగగా ఉందన్నారు. భరణి మాట్లాడుతూ జేపీఎల్‌లో జర్నలిస్టులందరూ రాణించాలని, లీగ్‌ విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్త‌ పత్రికలు, ఛానెళ్ల నుంచి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం