తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl 1st Odi Live: తడబడి కోలుకున్న శ్రీలంక.. టీమిండియా ముందు ఓ మోస్తరు టార్గెట్

Ind vs SL 1st ODI Live: తడబడి కోలుకున్న శ్రీలంక.. టీమిండియా ముందు ఓ మోస్తరు టార్గెట్

Hari Prasad S HT Telugu

02 August 2024, 18:15 IST

google News
    • Ind vs SL 1st ODI Live: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో తడబడి కోలుకుంది శ్రీలంక టీమ్. దీంతో టీమిండియా ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. మొదట్లో కట్టడి చేసిన బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు.
తడబడి కోలుకున్న శ్రీలంక.. టీమిండియా ముందు ఓ మోస్తరు టార్గెట్
తడబడి కోలుకున్న శ్రీలంక.. టీమిండియా ముందు ఓ మోస్తరు టార్గెట్ (BCCI-X)

తడబడి కోలుకున్న శ్రీలంక.. టీమిండియా ముందు ఓ మోస్తరు టార్గెట్

Ind vs SL 1st ODI Live: టీమిండియా ఇప్పటికే టీ20 సిరీస్ లో వైట్ వాష్ అయిన శ్రీలంక.. తొలి వన్డేలో మొదట తడబడి తర్వాత కోలుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్.. 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 రన్స్ చేసింది. ఓపెనర్ నిస్సంక, టెయిలెండర్లో వెల్లాలగే హాఫ్ సెంచరీలు చేయడంతో లంక ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.

మొదట్లోనే కట్టడి చేసినా..

టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్ లో మొదట చెలరేగి శ్రీలంక టాప్, మిడిలార్డర్ ను దెబ్బతీసినా.. తర్వాత వాళ్లకు కోలుకునే అవకాశం ఇచ్చారు. ఒక దశలో ఆ టీమ్ 26.3 ఓవర్లలో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ ఇద్దరు బౌలర్లు తమ 10 ఓవర్ల కోటాలో చెరో 33 పరుగులు మాత్రమే ఇచ్చారు. అక్షర్ 2, కుల్దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఆ ఇద్దరు హాఫ్ సెంచరీలతో..

అవిష్క ఫెర్నాండో (1), కుశల్ మెండిస్ (14), సమరవిక్రమ (8), కెప్టెన్ చరిత్ అసలంక (14), లియనాగె (20) విఫలమయ్యారు. అయితే ఓపెనర్ నిస్సంక, టెయిలెండర్లో వెల్లాలగె టీమిండియా బౌలర్ల జోరును అడ్డుకున్నారు. మొదట నిస్సంక (75 బంతుల్లో 56) హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో వెల్లాలగె వికెట్లు పడకుండా అడ్డుపడటంతోపాటు ధాటిగా ఆడాడు. అతడు కేవలం 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 66 రన్స్ చేశాడు.

దీంతో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేయగలిగింది. బౌలర్లు హసరంగ (20), ధనంజయ (17) కూడా బ్యాట్ తో రాణించారు. ఒక దశలో శ్రీలంక 150 పరుగులైనా చేస్తుందా అని అనిపించినా.. వీళ్ల పోరాటంతో 230 రన్స్ చేయడం విశేషం. ఇండియా బౌలర్లలో అక్షర్, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. సిరాజ్, కుల్దీప్, శివమ్ దూబె, సుందర్ తలా ఒక వికెట్ తీశారు.

తదుపరి వ్యాసం