IND vs ZIM 3rd T20 Predicted Final XI: శాంసన్‍కు ఓకే.. జైస్వాల్‍కు కష్టమే.. జింబాబ్వేతో మూడో టీ20కి భారత జట్టు ఇలా!
08 July 2024, 21:20 IST
- IND vs ZIM 3rd T20 Predicted Final XIs: జింబాబ్వేతో మూడో టీ20లో భారత తుదిజట్టులో మార్పులు ఉండనున్నాయి. సంజూ శాంసన్‍కు తుది జట్టులో ప్లేస్ దక్కే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్‍కు చోటు కష్టంగా కనిపిస్తోంది. తుది జట్టు ఎలా ఉండొచ్చంటే..
IND vs ZIM 3rd T20 Predicted Final XI: శాంసన్‍కు ఓకే.. జైస్వాల్‍కు కష్టమే.. జింబాబ్వేతో మూడో టీ20కి భారత జట్టు ఇలా!
జింబాబ్వే పర్యటనలో తొలి మ్యాచ్‍లో అనూహ్యంగా ఓడిన భారత జట్టు.. రెండో టీ20లో పుంజుకుంది. ఐదు టీ20ల సిరీస్‍లో రెండో మ్యాచ్‍లో 100 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. సిరీస్ 1-1తో నిలిచింది. జూలై 10వ తేదీన ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. కాగా, చివరి మూడు టీ20ల కోసం భారత జట్టుతో కలిశారు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే. టీ20 ప్రపంచకప్ జట్టులోని ఈ ముగ్గురు జింబాబ్వేకు వచ్చేందుకు ఆలస్యమైంది. దీంతో మూడో మ్యాచ్ నుంచి జట్టులో ఉండనున్నారు. దీంతో జింబాబ్వేతో మూడో టీ20లో భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
జురెల్ ప్లేస్‍లో శాంసన్
భారత యంగ్ స్టార్ సంజూ శాంసన్.. జింబాబ్వేతో మూడో టీ20 ఆడడం దాదాపు ఖాయంగా మారింది. తొలి రెండు మ్యాచ్‍లు ఆడిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ స్థానంలో సంజూ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. టీ20 ప్రపంచకప్‍లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంజూ.. జింబాబ్వేతో పోరుకు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
జైస్వాల్‍కు చోటు కష్టమే..
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వేలో టీమిండియాతో కలిశాడు. అయితే, మూడో మ్యాచ్‍లో అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో టీ20లో అద్భుత శతకం చేయటంతో అతడిని తప్పించే ఛాన్స్ లేదు. శుభ్‍మన్ గిల్ కెప్టెన్ కావటంతో అతడు ఉండడం పక్కా. రెండో టీ20లో మూడో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అజేయంగా 77 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టాపార్డర్‌లో ఎవరినీ తప్పించే ఛాన్స్ లేకపోవటంతో మూడో టీ20లో యశస్వి జైస్వాల్‍కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.
ఆల్ రౌండర్ శివం దూబేకు సాయిసుదర్శన్ ప్లేస్‍లో జింబాబ్వేతో మూడో టీ20లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. రింకూ సింగ్ 22 బంతుల్లోనే మెరుపు బ్యాటింగ్‍తో 48 అజేయంగా 48 పరుగులు చేశాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశం లేదు. ఒకవేళ దూబేకు చోటివ్వాలని టీమిండియా మేనేజ్‍మెంట్ అనుకుంటే సుదర్శన్‍ను బెంచ్‍కు పరిమితం చేయాల్సి ఉంటుంది. రియాన్ పరాగ్‍కు ప్లేస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
మూడో టీ20కి బౌలర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పేసర్లుగా ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ కొనసాగొచ్చు. దూబే కూడా మీడియం పేస్ వేయగలడు. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఉంటారు.
జింబాబ్వేతో మూడో టి20కి భారత తుదిజట్టు (అంచనా): శుభ్‍మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
జింబాబ్వేతో రెండో టీ20లో టీమిండియా ఏకంగా 100 పరుగులతో తేడాతో విజయం సాధించింది. టీమిండియాలో రెండో మ్యాచ్‍లోనే అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే 100 పరుగులతో మెరుపు శకతం చేశాడు. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో దుమ్మురేపి తొలి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. భారత్, జింబాబ్వే మధ్య జూలై బుధవారం (జూలై 10) మూడో టీ20 జరగనుంది. ప్రస్తుతం 1-1తో ఉండగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్‍లో ఆధిక్యంలోకి వెళుతుంది.
టాపిక్