IND vs ENG 5th Test: కుల్దీప్ స్పిన్ ధాటికి ఇంగ్లండ్ విలవిల - ఆదుకున్న క్రాలీ
07 March 2024, 12:42 IST
IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ తడబడి నిలబడింది. ఓపెనర్ క్రాలీ హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్
IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ తడబడి నిలబడింది. క్రాలీ హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. ప్రస్తుతం 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 130 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కోల్పోయిన రెండు వికెట్లు కుల్దీప్ యాదవ్ పడగొట్టడం గమనార్హం. ఇంగ్లండ్‌ను ఓపెనర్ జాక్ క్రాలీ ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం క్రాలీ (69 పరుగులు), రూట్(12 పరుగులు) క్రీజులో ఉన్నారు.
రెండు మార్పులు...
ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. చివరి టెస్ట్‌లో ఇండియా రెండు మార్పులు చేసింది. ఈ సిరీస్‌లో విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. విశ్రాంతి కారణంగా నాలుగో టెస్ట్‌కు దూరమైన బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
కుల్దీప్ బ్రేక్...
ఈ సిరీస్‌లో దూకుడుగా ఆడిన డకెట్ ఐదో టెస్ట్‌లో మాత్రం తన పంథాకు భిన్నంగా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. డకెట్, క్రాలీ ఇద్దరు టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తొలి వికెట్‌కు ఇద్దరు 64 పరుగులు జోడించారు. క్రీజులో పాతుకుపోయిన డకెట్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. టీమిండియా బ్రేక్ ఇచ్చాడు. 27 పరుగులు చేసిన డకెట్ కుల్దీప్ బౌలింగ్‌లో శుభ్‌మన్‌గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
క్రాలీ హాఫ్ సెంచరీ...
డకెట్ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఓలీపోప్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 11 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఓ వైపు రెండు వికెట్లు కోల్పోయిన క్రాలీ మాత్రం పట్టుదలగా ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
ఐదు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకున్నది. టీమిండియాకు ఈ టెస్ట్ నామమాత్రం కానుంది. ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో అదరగొట్టాడు. 655 పరుగులతో ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అశ్విన్‌కు ద్రావిడ్ క్యాప్...
కాగా అశ్విన్‌కు ఇది వందో టెస్ట్ కావడం గమనార్హం. వందో టెస్ట్ మ్యార్ క్యాప్‌ను అతడికి కోచ్ ద్రావిడ్ అందజేశాడు. వంద టెస్ట్‌లు పూర్తి చేసుకున్న అతడికి బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపికను అందజేసింది. అశ్విన్ టీమిండియా క్రికెటర్లు, అభిమానులను ఘనంగా స్టేడియంలోకి ఆహ్వానించారు. ఈ ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. టీమిండియా తరఫున వంద టెస్టులు పూర్తిచేసుకున్న 14వ ఆటగాడిగా అశ్విన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 99 టెస్టుల్లో అశ్విన్ 507 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టోకు కూడా ఇది వందో టెస్ట్ మ్యాచ్. ఈ చిరస్మరణీయ టెస్ట్‌లో వీరిద్దరు ఎలా ఆడుతాన్నరన్నది ఆసక్తికరంగా మారింది.