IND vs AUS: భారత్‍తో సిరీస్‍లో మార్పు కోసం ఆస్ట్రేలియా ప్లేయర్ స్మిత్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన కెప్టెన్
14 October 2024, 17:58 IST
- IND vs AUS Border Gavaskar Trophy: భారత్‍తో టెస్టు సిరీస్‍లో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు ఉండనుంది. మళ్లీ తన పాత ప్లేస్‍లో బ్యాటింగ్‍కు దిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ వెల్లడించాడు.
IND vs AUS: భారత్‍తో సిరీస్‍లో మార్పు కోసం ఆస్ట్రేలియా ప్లేయర్ స్మిత్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన కెప్టెన్
టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‍ను టెస్టు, టీ20 సిరీస్‍ల్లో క్లీన్‍స్వీప్ చేసింది. ముఖ్యంగా బంగ్లాతో రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. ఫుల్ ఫామ్‍లో ఉంది. తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్‍తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 16న ఈ సిరీస్ మొదలుకానుంది. ఆ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. నవంబర్ 24 నుంచి ఆసీస్ గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్‍పై ఇప్పటి నుంచి ఆసక్తి విపరీతంగా నెలకొంది. భారత్, ఆస్ట్రేలియా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ విషయంలో ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాటింగ్ ఆర్డర్ మార్పు
స్టీవ్ స్మిత్ కొంతకాలంగా టెస్టుల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్‍కు దిగుతున్నాడు. అయితే, భారత్‍తో జరిగే టెస్టు సిరీస్ కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలని కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హెడ్‍కోచ్ ఆండ్రూ మెక్‍డొనాల్డ్‌ను స్టీవ్ స్మిత్ అడిగాడు. ఇందుకు కమిన్స్ అంగీరించాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ వెల్లడించాడు.
స్టీవ్ స్మిత్ మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడని బెయిలీ చెప్పాడు. “ఓపెనింగ్ పొజిషన్ నుంచి మళ్లీ కిందికి వెళ్లాలని స్మిత్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ప్యాట్, ఆండ్రూ దాన్ని కన్ఫర్మ్ చేశారు. సమ్మర్ నుంచి అతడి బ్యాటింగ్ ఆర్డర్ కాస్త కిందే వస్తాడు” అని బెయిలీ వెల్లడించాడు. పాకిస్థాన్‍తో సిరీస్‍కు ఆసీస్ ఎంపిక సందర్భంగా ఈ విషయంపై మాట్లాడాడు.
స్టీవ్ స్మిత్ చాలా ఏళ్ల పాటు టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చి అద్భుతంగా ఆడాడు. అయితే, గతేడాది డేవిడ్ వార్నర్ రిటైర్ అవటంతో ఓపెనర్‌గా మారాడు. అయితే, టెస్టుల్లో ఓపెనర్‌గా పెద్దగా సక్సెస్ అవలేకపోయాడు. దీంతో మళ్లీ టెస్టుల్లో నాలుగో ప్లేస్‍లోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
సిరీస్‍కు గ్రీన్ ఔట్.. ఆసీస్‍కు ఎదురుదెబ్బ
భారత్‍తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా స్టార్ ఆల్‍రౌండర్ కామెరూన్ గ్రీన్ దూరం కానున్నాడు. అతడు వెన్ను సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సుమారు ఆరు నెలల పాటు అతడు ఆటకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాతో సిరీస్ నుంచి ఔటయ్యాడు. ఇది ఆసీస్‍కు పెద్దగా ఎదురుదెబ్బగా మారింది. ఆ ప్లేస్‍లో ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధత నెలకొంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత నాలుగుసార్లు టీమిండియానే కైవసం చేసుకుంది. ఇందులో రెండుసార్లు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‍లు గెలిచి సత్తాచాటింది. ఇప్పుడు మరోసారి అదరగొట్టి టైటిల్ నిలుపుకోవాలనే పట్టుదలతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఉంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనుంది. రెండో టెస్టు డిసెంబర్ 6న ఆడిలైడ్‍లో మొదలవుతుంది. మూడో టెస్టు బ్రిస్బేన్‍లో డిసెంబర్ 14న షురూ అవుతుంది. మెల్‍బోర్న్ స్టేడియంలో డిసెంబర్ 26వ తేదీ నుంచి నాలుగో టెస్టు జరుగుతుంది. సిరీస్‍లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో 2025 జనవరి 3న మొదలవుతుంది.