తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus Betting Odds: వరల్డ్ కప్ ఫైనల్‌పై వేల కోట్ల బెట్టింగ్.. టీమిండియానే వాళ్ల ఫేవరెట్

Ind vs Aus Betting odds: వరల్డ్ కప్ ఫైనల్‌పై వేల కోట్ల బెట్టింగ్.. టీమిండియానే వాళ్ల ఫేవరెట్

Hari Prasad S HT Telugu

19 November 2023, 11:43 IST

google News
    • Ind vs Aus Betting odds: వరల్డ్ కప్ ఫైనల్‌పై వేల కోట్ల బెట్టింగ్ నడుస్తోంది. అయితే ఈ బెట్టింగ్ లో పందెం రాయుళ్ల ఫేవరెట్ మాత్రం టీమిండియానే కావడం విశేషం.
ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడటానికి నరేంద్ర మోదీ స్టేడియానికి తరలి వస్తున్న వేలాది మంది అభిమానులు
ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడటానికి నరేంద్ర మోదీ స్టేడియానికి తరలి వస్తున్న వేలాది మంది అభిమానులు (REUTERS)

ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడటానికి నరేంద్ర మోదీ స్టేడియానికి తరలి వస్తున్న వేలాది మంది అభిమానులు

Ind vs Aus Betting odds: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఫేవరెట్ ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఈ మెగా ఫైనల్ పై నడుస్తున్న బెట్టింగ్ లో మాత్రం ఇండియానే ఫేవరెట్ అని తేల్చేవారు. టోర్నీలో ఓటమెరగని జట్టుగా ఉన్న ఇండియన్ టీమ్ పై భారీగా పందెం కాస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

టీమిండియానే ఫేవరెట్

ఆస్ట్రేలియాలోని బెట్టింగ్ సంస్థ స్పోర్ట్స్‌బెట్ (Sportsbet) ఇండియా గెలిస్తే ఒకటికి 1.4 రెట్లు ఆఫర్ చేస్తోంది. అదే ఆస్ట్రేలియాపై ఇది ఏకంగా 2.9 రెట్లు కావడం విశేషం. ఆ లెక్కన ఇండియానే ఫేవరెట్ అని తేల్చేశారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై తక్కువ మొత్తం ఆఫర్ చేస్తుంటారు. ఆస్ట్రేలియాలోనూ తమ జట్టు గెలుస్తుందన్న నమ్మకం లేదని ఈ బెట్టింగ్స్ తేలుస్తున్నాయి.

ఇక ఇటు యూకేకు చెందిన బెట్‌ఫెయిర్ కూడా దాదాపు ఇలాగే ఆఫర్ చేస్తున్నాయి. ఇండియా గెలిస్తే 1.49 రెట్లు ఇస్తామని, అదే ఆస్ట్రేలియా గెలిస్తే 3 రెట్లు ఇవ్వనున్నట్లు చెప్పడం విశేషం. ఇండియాలో మాత్రం బెట్టింగ్ చట్ట విరుద్ధం. కేవలం గుర్రపు పందేలు మాత్రమే మన దేశంలో లీగల్. దీంతో అధికారికంగా ఈ ఫైనల్ పై బెట్టింగ్ జరగడం లేదు. అనధికారికంగా మాత్రం ఈ ఫైనల్ సందర్భంగా వేల కోట్లు చేతులు మారనున్నాయి.

బెట్టింగ్ మార్కెట్ అనలిస్టులు కూడా ఇండియా ఫేవరెట్ అని తేల్చేశారు. ఇండియాపైనే ఎక్కువ మంది పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను లక్షా 30 వేల మంది ప్రత్యక్షంగా చూస్తారని అంచనా. ఈ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తున్నారు. మాజీ కెప్టెన్లు ధోనీ, కపిల్ దేవ్ తోపాటు మరెంతో మంది క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఫైనల్ చూడనున్నారు.

ఈ ఫైనల్ మ్యాచ్ కోసం 6 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని కూడా వస్తుండటంతో నరేంద్ర మోదీ స్టేడియం పూర్తిగా భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

తదుపరి వ్యాసం