IND vs AUS Final Match: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్.. వాతావరణం, పిచ్ ఎలా ఉందంటే?-world cup 2023 ind vs aus final match weather report and pitch details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus Final Match: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్.. వాతావరణం, పిచ్ ఎలా ఉందంటే?

IND vs AUS Final Match: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్.. వాతావరణం, పిచ్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2023 08:02 AM IST

IND vs AUS Final Match Weather Report: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 తుది ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 19న వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాగా సాగనున్న క్రమంలో అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉందో చూద్దాం.

వరల్డ్ కప్ 2023 భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ వాతావరణ వివరాలు
వరల్డ్ కప్ 2023 భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ వాతావరణ వివరాలు

World Cup 2023 Ind vs Aus Final Match Updates: ఐసీసీ ప్రపంచ కప్ 2023 మెగా టోర్నమెంట్ తుది పోరుకు సిద్ధమైంది. పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియా రెడీగా ఉంది. 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్ ఇప్పుడు బదులు తీర్చుకోవాలని సంకల్పంతో చూస్తోంది. ఈ టోర్నోలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ పోరులోకి ప్రవేశించింది భారత్.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వెదర్, పిచ్ వవరాలు

అలాగే, 10 మ్యాచ్‌లకు 8 గెలిచి ఫైనల్‌లోకి స్థానం సంపాదించింది ఆస్ట్రేలియా. నేడు అంటే నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ కోసం భారతీయులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని వాతావరణం, నరేంద్ర మోదీ మైదానం పిచ్ వివరాలు ఆసక్తిగా మారాయి.

విపరీతమైన ఎండ

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ 2023 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదబాద్ సిటీలో విపరీతమైన ఎండ ఉండనుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా అహ్మదాబాద్ వాతావరణం ఉండనుందట. దీంతో వరల్డ్ కప్ తుది పోరులో వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది.

సాయంత్రం మంచు

అయితే, మ్యాచ్ సమయంలో 17 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత తగ్గి మంచు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే టీమ్‌కు ప్రయోజనం ఉండనుందట. ఒకవేళ మ్యాచ్ సమయంలో వర్షం పడినా ఫైనల్ కోసం రిజర్వ్ డేని ఇప్పటికే కేటాయించింది ఐసీసీ. తర్వాతి రోజ మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగిస్తారు.

క్యూరేటర్స్ మరోలా

ఇక నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌కు బ్లాక్ సాయిల్ (నల్ల మట్టి)ని వాడినట్లు సమాచారం. శుక్రవారం పిచ్‌ను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిశీలించారు. ఈ పిచ్ రెండో బ్యాటింగ్ చేసేవారికి అనుకూలంగా ఉండకపోవచ్చని క్యూరెటర్లు తెలిపారు. ఇలా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో వరల్డ్ కప్ 2023 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కీలకంగా, ఉత్కంఠంగా సాగనుంది.

Whats_app_banner